ఈ మూవీ ఈ నెల 14 వతారీఖున రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈ వెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రియదర్శి మెయిన్ లీడ్ లో చేస్తున్న సినిమా కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హర్ష్ రోషన్ , శ్రీదేవి జంటగా నటిస్తున్నారు. శివాజీ , సాయికుమార్ , రోహిణి ,హర్ష వర్ధన్ కీలకపాత్రలు చేస్తున్నారు. అయితే ఈమూవీ హోలీ సంధర్భంగా రిలీజ్ అవుతుంది. హీరో నాని ప్రోడక్షన్ హౌస్ నుంచి వస్తుండడంతో ఈ చిత్రం పై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి
ఈ మూవీ ఈ నెల 14 వతారీఖున రిలీజ్ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈ వెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ ను నాని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సినీ పరిశ్రమలోకి వచ్చి 16 ఏళ్లు దాటిందన్నారు. అయినప్పటికి ఇప్పటి వరకు ఫలానా సినిమా చూడాలని తానెప్పుడు చెప్పలేదన్నారు. కానీ.. కోర్టు మూవీని ప్రతి ఒక్కరు చూడాలన్నారు.