మంచి కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, టాక్ షోలతో ఆడియన్స్‌ను అలరిస్తోంది. తాజాగా సుమ కనకాల హోస్ట్‌గా చేస్తోన్న ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K’ ఆహోలో స్ట్రీమింగ్ అవుతోంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలుగు ఆడియన్స్ కు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా డిఫరెంట్ గా ...క్రియేటివ్ గా ఆలోచించే ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. మంచి కంటెంట్ ఉన్న మూవీస్, వెబ్ సిరీస్, టాక్ షోలతో ఆడియన్స్‌ను అలరిస్తోంది. తాజాగా సుమ కనకాల హోస్ట్‌గా చేస్తోన్న ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K’ ఆహోలో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే అక్కడా ఇక్కడా ఛెఫ్ మంత్ర ..పేరు వినిపిస్తుంది. చెఫ్ మంత్ర 1,2,3 సీజన్లు ఎంతగానో అలరించాయి. ఇక సీజన్ 4 మరింతగా అలరించనుంది. ప్రాజెక్ట్ k అంటే ఏంటి అనేది క్యూరియాసిటీ పెంచుతుంది. సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కెలో తన వంతు వినోదాన్ని యాడ్ చేస్తూ షో ను మరింత ఎంటర్ టైనింగ్ గా చేస్తున్నారు.అమర్ దీప్-అర్జున్, దీపికా రంగరాజు-సమీరా భరద్వాజ్, సుప్రిత-యాదమ్మ రాజు, ప్రషు-ధరణి, విష్ణుప్రియా-పృథ్వీ జోడీ లు రుచికరమైన వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
ఒక్క తెలుగు వంటలతో పాటు సర్ ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్ లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 4 లో అందిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ చూసి ప్రొగ్రామ్ కె అంటే తెలుసుకోవల్సిందే.