రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్‌సీ16లోనూ ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ రోజు జాన్వీ కపూర్ బర్త్ డే . అందుకే ఆర్ సీ 16 మూవీ టీం ..తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి..ఫుల్ స్పీడ్ లో ఉంది. మొన్న దేవరతో టాలీవుడ్ లోను సూపర్ ఎంట్రీ ఇచ్చింది.2018లో ‘ధడక్’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ చిన్నది చాలా తక్కువ సమయంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్‌సీ16లోనూ ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ రోజు జాన్వీ కపూర్ బర్త్ డే . అందుకే ఆర్ సీ 16 మూవీ టీం ..తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది.
ఇందులో జాన్వీకపూర్ కుడి చేత్తో మేకపిల్లను ఎత్తుకోగా, ఎడమ చేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ దసరాకు రిలీజ్ అవుతుంది.