Sundeep Kishan: దళపతి విజయ్ కొడుకుతో సందీప్ కిషన్ మూవీ?

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ చిత్రం చేస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. అయితే దళపతి విజయ్ కొడుకు డైరక్షన్ లో ..సందీప్ కిషన్ హీరోగా చేస్తున్నట్లు టాక్.


Published Sep 09, 2024 02:41:00 PM
postImages/2024-09-09/1725873160_Screenshot20240909143813.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఇండస్ట్రీలో చాలా మందియాక్టర్స్ పిల్లలు ..యాక్టర్స్ అయ్యారు..డైరక్టర్ల పిల్లలు డైరక్టర్లు అయ్యారు. చాలా తక్కువ మందే హీరోల పిల్లలు క్యారక్టర్ ఆర్టిస్ట్ లుగా , విలన్స్ గా తమకు నచ్చినట్లు ఇండస్ట్రీకి వచ్చారు. కాని ఓ స్టార్ హీరో కొడుకు డైరక్టర్ అవ్వడం మాత్రం ఇదే మొదటిసారి.అతడే దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్. అతడిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ చిత్రం చేస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. అయితే దళపతి విజయ్ కొడుకు డైరక్షన్ లో ..సందీప్ కిషన్ హీరోగా చేస్తున్నట్లు టాక్.


దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ త్వరలోనే..  లైకా ప్రొడక్షన్ హౌస్ ఆధ్వర్యంలో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు.  ఇంకో హైప్ ఏంటంటే ..ఏఆర్ రెహమాన్ కొడుకు సంగీతం అందించబోతున్నట్లుగా టాక్ . అతడు కూడా ఈ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇది మాత్రం మాస్ ఎంట్రీ అంటున్నారు మూవీ లవర్స్.


సందీప్ మంచి హిట్ జోష్ లో ఉన్నాడు. ‘రాయన్’ లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. జాసన్ సంజయ్ తండ్రి దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గోట్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. వసూళ్ల పరంగా కూడా విజయ్ అదరగొడుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కలక్షన్లు కూడా చాలా బాగున్నాయి.మరోసారి సందీప్ కు హిట్టు పడుతుందా...విజయ్ దళపతి కొడుకు ఇండస్ట్రీ లో తన మార్క్ వేస్తాడా..రెహామాన్ తనయుడు తన తండ్రి మార్క్ ను రీచ్ అవుతాడా చూడాలి.
 

newsline-whatsapp-channel
Tags : dalapathi-vijay sandeepkishan music

Related Articles