సిద్ధార్థ్ అదితిని ఆ సీక్రెట్ చెప్పి లవ్ లో పడేశారట..!

హీరో సిద్ధార్థ అదితి రావు హైదరి  ప్రేమించుకుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దగ్గర బంధుమిత్రుల మధ్య ఒక గుళ్లో వీరిద్దరూ ఏకమయ్యారు. అయితే వీరి పెళ్లి తర్వాత  అదితి రావు హైదరి


Published Oct 06, 2024 02:25:00 PM
postImages/2024-10-06/1728202593_siddarth.jpg

న్యూస్ లైన్ డెస్క్: హీరో సిద్ధార్థ అదితి రావు హైదరి  ప్రేమించుకుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దగ్గర బంధుమిత్రుల మధ్య ఒక గుళ్లో వీరిద్దరూ ఏకమయ్యారు. అయితే వీరి పెళ్లి తర్వాత  అదితి రావు హైదరి  వీరి ప్రేమకు సంబంధించిన విషయాన్ని  ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అయితే వీరిద్దరూ కలిసి మహాసముద్రం అనే మూవీలో నటించారు. ఈ టైంలో వీరి మధ్య ప్రేమ మొదలైంది. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో   సిద్ధార్థ్ ఒకరోజు నన్ను హలో బ్యూటిఫుల్ గర్ల్ అని పిలిచాడు.

ఎవరైనా అలా పిలిస్తే నాకు నచ్చదు కానీ సిద్ధార్థ్ పిలిస్తే ఎందుకో చాలా బాగా అనిపించింది.. అలా సిద్ధార్థ్ చాలా కలిసిపోయి మాట్లాడేవారు. అందరిని సరదాగా ఉంచేవారు. ప్రతిరోజు చిత్ర యూనిట్ కి మొత్తం తన కుక్ తో ప్రత్యేకంగా  తయారు చేయించిన నేతి ఇడ్లీలను కూడా తీసుకువచ్చేవాడు. అలా సిద్ధార్థతో నాకు మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఆయన నా గురించి నా సీక్రెట్స్ గురించి షూటింగ్ అయిపోయేలోపు పూర్తిగా తెలుసుకున్నాడు. అయితే నాకు చిన్నతనం నుంచి మా అమ్మమ్మ స్కూల్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా అక్కడే గడిపే దాన్ని. నేను నా బర్త్ డే కానీ, ఇతర ఏ ఫంక్షన్లు లాంటివి చేసుకున్న ఆ ప్లేస్  లో జరుపుకునే దాన్ని.  అక్కడకి వెళ్లి ఏ పని చేసినా మా అమ్మమ్మ ఆశీస్సులు నాపై ఉన్నట్టే అని భావిస్తాను.

అయితే ఈ సీక్రెట్ నేనెవరికీ చెప్పేదాన్ని కాదు. కానీ ఈ విషయాన్ని సిద్ధార్థ్ తెలుసుకొని సినిమా  షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓ రోజు ఆ స్కూలుకు తీసుకెళ్లి మోకాళ్ళపై కూర్చొని నాకు ప్రపోజ్ చేశాడు. దీంతో నేను ఆయనకు ఇంప్రెస్స్ అయిపోయి లవ్ లో పడ్డాను.. అంతే కాదు నన్ను పెళ్లి చేసుకుంటావా అని కూడా అడిగాడు.. దీంతో నేను మా అమ్మమ్మ స్కూల్లో నన్ను  ఈ విధంగా అడగడంతో కదనలేకపోయానని  చివరికి ఆయనతో లవ్ లో పడి పెళ్లి కూడా చేసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అదితి  రావు హైదరి.

newsline-whatsapp-channel
Tags : news-line marriage love-story siddarth mahasamudram aditi-rao-hydari

Related Articles