జానీ మాస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి జానీ మాస్టర్ ఎంతోమంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: జానీ మాస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి జానీ మాస్టర్ ఎంతోమంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి జానీ మాస్టర్ తన కింద పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను వేధించి చివరికి కేసుల పాలయ్యారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం జానీ మాస్టర్ మీద ఫోక్సో కేస్ రిజిస్టర్ అయింది. దీంతో ఆయన కెరియర్ పై అతిపెద్ద దెబ్బ పడడమే కాకుండా ఆయన ఇన్నాళ్లు పడ్డ కష్టానికి లభించే పురస్కారం కూడా వెనక్కి వెళ్లిపోయింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా జానీ మాస్టర్ కేసులో ఇరుక్కుని మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ తనపై ఉన్న కేసు మాత్రం అలాగే ఉంది. అయితే జానీ మాస్టర్ కు తమిళ మూవీ తిరు చిత్ర బలంలోని మేఘం కరుగత పాటకు ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డుకు ఎంపిక అయ్యారు. 2024 కు గాను 70వ చలనచిత్ర జాతీయ అవార్డులో భాగంగా ఇదే సంవత్సరం ఈ ప్రకటన చేసింది కేంద్ర సర్కార్. అయితే అక్టోబర్ 8వ తేదీన ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది.
దీనికోసమే కోర్టు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ ఫోక్సో కేసులో ఇరుక్కోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇచ్చే అవార్డును రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఆయనకు లభించే అత్యున్నత పురస్కారం వెనక్కి వెళ్లడంతో ఆయన కెరియర్ పై దెబ్బ పడిందని కొంతమంది సినీ విశ్లేషకులు అంటున్నారు.