శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహించారు టీటీడీ పూజారులు. స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనాన్ని అధిరోహించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గోవిందనామ స్మరణతో సప్తగిరులు మారుమోగిపోతున్నాయి. భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. స్వామివారి సాలకట్ల బ్రహ్మాత్సవాల్లో భాగంగా నిన్న శనివారం చిన్నశేషవాహనం పై ఊరేగింపు జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటనుంచి మూడు గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహించారు టీటీడీ పూజారులు. స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనాన్ని అధిరోహించారు.
శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. మూడో రోజు ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సింహ వాహనసేవ జరుగుతోంది. స్వామి వారి దర్శనానికి భక్తులు భారీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు వాహనసేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వర నృత్య కళాశాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బృందాల ప్రదర్శనలు ఆహూతులను అలరిస్తున్నాయి. సింహ వాహన సేవ లో స్వామి వారు తిరుమాడ వీధుల్లో దర్శనమిస్తున్నారు.
అంతేకాదు ..పలు రాష్ట్రాల నుంచి భజన బృందాలు , కోలాటం బృందాలు, సేవ , ఇలాంటి వేల సంఖ్యలో స్వామి వారికి సేవ చేయడానికి తరలివచ్చారు. శ్రీనివాసుని దర్శనానికి లక్షల్లో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.