TEJA SAJJA: తేజసజ్జాకు ప్రతిష్ఠాత్మక అవార్డ్..ఇదంతా ఆ సినిమా వల్లే !

ఈ హనుమాన్ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన తేజ సజ్జా ..అటు బాలీవుడ్ ..టాలీవుడ్ లో దుమ్ముదులిపేసే కలక్షన్లు కొట్టింది. 


Published Oct 05, 2024 09:15:42 AM
postImages/2024-10-05/1728137685_HanuManTejaSajja.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ యాక్టర్ తేజ సజ్జాకు ఉత్తమ నటుడిగా అవార్డు వరించింది. 'హనుమాన్‌' చిత్రంలో నటనకుగానూ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దాదా సాహెబ్‌ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్‌ - 2024 ఈ వార్డును ప్రకటించింది. ఈ మేరకు హనుమాన్ మూవీ మేకర్స్​ సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశారు. ఈ హనుమాన్ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన తేజ సజ్జా ..అటు బాలీవుడ్ ..టాలీవుడ్ లో దుమ్ముదులిపేసే కలక్షన్లు కొట్టింది. 


అన్ని ఇండస్ట్రీల్లో తేజ సజ్జా ..పేరు మారుమోగిపోయింది. యాక్టింగ్ అదరగొట్టేశాడని..చాలా అందంగా ఉన్నాడని ఇలా చాలా కంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ మూవీని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. 2024 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. వరల్డ్​వైడ్​గా రూ.300+ కోట్లు వసూళ్లు సాధించింది. అయితే పార్ట్ 2 కి మాత్రం చాలా టైం పట్టేలా ఉంది. 


హనుమాన్ 2 లో ఏ ఇయర్ రిలీజ్ అనేది ప్రశాంత్ వర్మ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. ఇక పోతే తేజ సజ్జా మాత్రం మిరాయ్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మిరాయ్ మీద జనాలకు విపరీతమైన బజ్ ఉంది. ఇండస్ట్రీ లో జనాలు తేజ సజ్జాకు కంగ్రాట్స్ చెబుతున్నారు .

 

Related Articles