Devara:దేవర నుంచి స్పెషల్ పోస్టర్..డబుల్ యాక్షన్ ఉంటుందా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందారు కొరటాల శివ. ఈయన సినిమా అంటే తప్పకుండా యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.  అలాంటి కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ జనతా


Published Aug 27, 2024 10:50:52 AM
postImages/2024-08-27/1724736052_DEVARAPOSTER.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరుపొందారు కొరటాల శివ. ఈయన సినిమా అంటే తప్పకుండా యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.  అలాంటి కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది.  ఈ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ ఎన్టీఆర్ తో "దేవర" చిత్రాన్ని రూపొందిస్తున్నారు కొరటాల శివ. జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలు  రాజమౌళి డైరెక్షన్ లో చేశారు.

 ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఆ సినిమా రేంజ్ లోనే దేవరా చిత్రాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై అభిమానులకు అనేక అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా పెట్టడంతో  ఈ చిత్రంపై మరింత బజ్ పెరిగిపోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్టర్లు  రిలీజ్ చేస్తూ వస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి  ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్  చాలా కోపంగా చూస్తున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఆయన లుక్ చూస్తే  శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తెల ఉన్నది.

https://www.instagram.com/p/C_KQcK0BGQr/?igsh=MTRzNTF0YnM0cXRsZQ==

 సరిగ్గా 27వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెంచడం కోసం ఇవాళ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చిత్ర యూనిట్.  దీనికి "ది ఫేసెస్ ఆఫ్ ఫీయర్" అని క్యాప్షన్ ఇచ్చారు. ఎన్టీఆర్ రెండు రకాల లుక్స్ లో కనిపిస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు. దీన్ని చూసిన అభిమానులు ఎన్టీఆర్ దేవరాలో డబుల్ యాక్షన్ లో కనిపిస్తారా ఏంటి అంటూ  కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu jr-ntr devara johnvi-kapoor koratala-shiva devara-special-poster

Related Articles