THAPSEE: తల్లి కాబోతున్న తాప్సీ ..వైరల్ అవుతున్న ట్వీట్

తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆకట్టుకునే రూపం, క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసింది తాప్సీ పన్ను.  


Published Sep 12, 2024 05:32:13 AM
postImages/2024-09-12/1726137028_pannu.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్  : రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ తాప్సీ. ముద్దుగా బొద్దుగా భలే అందంగా ఉండేది. సినిమా టు సినిమా తనను తాను శిల్పంలా మార్చుకుంది. స్ట్రాంగ్ గా బోల్డ్ గా ప్రతి సినిమాకు ఓ మెట్టు పైకెక్కింది. తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది. ఆకట్టుకునే రూపం, క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేసింది తాప్సీ పన్ను.  


లేడీ ఓరియంటెడ్ సినిమాలను చింపేస్తుంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ సినిమాతో మన ముందుకు వస్తోంది ఈ బ్యూటీ. ‘తల్లి ఆశీర్వాదం బిడ్డకు ఎల్లప్పుడూ ఉంటుందని అందరూ అంటారు. అలాగే తన బిడ్డ విషయానికి వస్తే.. ఆమె కాళీమాతగా మారుతుంది’ అనే డైలాగ్ తో తాజాగా తాప్సీ ఓ వీడియోను విడుదల చేసింది. అయితే ఈ సరికొత్త ప్రాజెక్ట్ లో తాప్సీ ఓ బిడ్డకు తల్లిగా కనిపించనుంది. ఇక ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ డైలాగతల్లి కూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ ఈ వీడియోతో హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


 అయితే తల్లిపాత్రలో తాప్సీ ఎలా మెప్పిస్తుందనేది మిలియన్ డాలర్ లప్రశ్న. అయితే తాప్సీ స్టోరీ సెలక్షన్ చా లా బాగుంటుంది. మరి ఈ కథేంటో చూడాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news new-movie tapsi-pannu- lady-orianted-movie

Related Articles