దీంతో చాలా రోజుల తర్వాత విక్రమ్ కు హిట్ దక్కింది. రీసెంట్ గా ఈ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: చియాన్ విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ డైరక్షన్ లో వచ్చిన మూవీ తంగలాన్ గతేడాది ఆగష్టు న స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తో నడుస్తుంది. దీంతో చాలా రోజుల తర్వాత విక్రమ్ కు హిట్ దక్కింది. రీసెంట్ గా ఈ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
నేడు ఈ మూవీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం అవుతుంది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతునన రాటర్ డామ్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాబోతుంది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా డైరక్టర్ కట్ ను ప్రదర్శించబోతున్నట్లు డైరక్టర్ పా. రంజిత్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. తమ చిత్రానికి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.