అసెంబ్లీలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తను అసెంబ్లీలో సబితమ్మ, సునీతమ్మలకు అక్క అని సంబోధించనాని అన్నారు. సబితా ఇంద్రా రెడ్డిని నా సొంత అక్కగా భావించనాని అన్నారు. తనకు టికెట్ ప్రకటించగానే సబిత రెడ్డి పార్టీ మారారు.
సభలో సబితమ్మ, సునీతా లక్ష్మా రెడ్డిలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం చెప్పారు. నర్సాపూర్ లో 2018లో ఎన్నికల ప్రచారంకు వెళ్తే తనపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికి కూడా కోర్టు లకు తిరుగుతున్న అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చెయ్ అని చెప్పితే దగ్గరుండి ప్రచారం చేస్తా అన్నారు. టికెట్ ప్రకటన కాగానే ఆమె పార్టీ మారింది. నర్సాపూర్ లో సునీతమ్మ నేను ప్రచారంకు నేను వెళ్తే తను పోటీ చేసేటప్పుడు వెళ్లిపోయారు. అక్క బాధ్యత తమ్ముడి కోసం నిలబడాలి కానీ మరో పక్క నిలబడిందని అన్నారు. అసెంబ్లీలో మేము చాలా డెమోక్రటిక్‌గా ఉన్నామన్నారు.
కొందరు సభ్యుల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదన్నారు. గతంలో కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలు రద్దు చేయలేదా అని గుర్తు చేశారు. గతంలో కొన్ని సాంప్రదాయాలు నెలకోల్పారని, నన్ను ఏరోజు అసెంబ్లీలో కూర్చోనివ్వలేదని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా బడ్జెట్ పై ఇంత చర్చ జరగలేదని, ప్రజాస్వామ్య బద్దంగా సభ నడుస్తుందన్నారు. ఓక్క రోజు 17 గంటల పాటు సభ నడిచిందని, కేంద్ర బడ్జెట్ కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టామని తెలిపారు.
సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలబడాలి కదా? సభలో గంధరగోళం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగదీశ్వర్ రెడ్డి గంటా 10 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్, హరీష్, జగదీశ్వర్ రెడ్డిలు మొత్తంగా 6 గంటలు మాట్లాడారు. అందుకే సబిత ఇంద్రారెడ్డికు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.