రూట్ మార్చిన కమ్యూనిస్టులు!

మ్యూనిస్టు పార్టీలో సీనియర్ నేత. పదేళ్ల పాటు అధ్యక్షుడిగా సేవలందించారు. ఆ కాలంలో ఆయన క్యాస్టిజం పెంచారని, పార్టీలో గ్రూపులు పెట్టారని కేంద్ర కమిటీ ఆరోపించింది. తీవ్ర ఆరోపణలతో కామ్రెడ్ పై ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. అంతర్గత విభేదాలతోనే ఇదంతా జరిగిందా..? లేదంటే ఎవరైనా కావాలనే చేశారు. ఆయన వైఖరిపై కేంద్ర తీవ్ర ఆగ్రహానికి కారణం ఏంటీ..? ఇంతకు కేంద్ర కమిటీ ఆగ్రహానికి లోనైన ఆ కమ్యూనిస్ట్ లీడర్ ఎవరు..? 


Published Mar 05, 2026 02:05:00 PM
postImages/2026-03-05/1772696214_THAMINENI.jpg

సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నిక సమయంలో ప్రజాతంత్ర చర్చ, ఏకాభిప్రాయ సాధన స్థానంలో లాబీయింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పీళ్లు చోటు చేసుకున్నాయని విమర్శించింది. పార్టీ ప్రమాణాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టింది. ఆ ఎన్నికల సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలిందని పేర్కొంది. 


పార్టీ అంతర్గత నిర్మాణం, క్రమశిక్షణను ఉల్లంఘించడం, గ్రూపిజం, క్యాస్టిజం, పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించడం.. ఇలా అనేక అంశాలపై కేంద్ర కమిటీ తప్పుబట్టిందని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ ఈ విధంగా ఉండటానికి పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయాలే కారణమంటూ తమ్మినేని వీరభద్రం విమర్శించినట్లు సమాచారం. దీంతో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై మధురైలో జరిగిన జాతీయ కమిటీ సమావేశంలో అగ్ర నేతలు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. పార్టీ కేంద్ర కమిటీ ముగ్గురు సభ్యులతో ఓ కమిషన్ ను నియమించింది. అది గతంలో రాష్ట్రంలో పర్యటించి పార్టీ ముఖ్య నాయకులందరితో విడివిడిగా మాట్లాడింది వారందరి అభిప్రాయాలు సేకరించిన ఓ నివేదికకు కేంద్ర కమిటీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కమిషన్ నివేదిక ఆధారంగా తమ్మినేనిపై అభిశంసన లేఖను కేంద్ర కమిటీ తయారు చేసింది. 


తమ్మినేని కూడా ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2025 పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల్లో కూడా కేంద్ర నాయకత్వం  ఆలోచనలు, ప్రతిపాదనలకు భిన్నంగా తమ్మినేని ఓటింగ్ కు పట్టుబట్టి, గ్రూపులు క్రియేట్ చేసి, పార్టీలో మనస్పర్థలు, విభేదాలకు కారణమయ్యారు. రాజకీయ పార్టీల వాతావరణంలో సీపీఎం ఏకంగా తన కేంద్ర కమిటీ సభ్యుడినే అభిశంసించడానికి పూనుకోవడం సంచలనంగా మారింది. 

రాష్ట్ర కార్యదర్శి తన బాధ్యతలను స్వతంత్రంగా సమర్థంగా నిర్వర్తించాలని కోరుతోంది. రాష్ట్ర కమిటీలో సమిష్టి పనివిధానాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత తమ్మినేనికే ఉండేదని కమిటీ వెల్లడించింది. అయితే.. తమ్మినేని పనితీరుపై ఇన్నాళ్లకు ఓ మథనం జరగడం కూడా ఆశ్చర్యమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన గ్రూపులు క్రియేట్ చేయడం దగ్గర నుంచి… పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి డబ్బు వసూలు చేసి టీవీ చానెల్ పెట్టడం, అమ్మేయడం, ఆ డబ్బు ఎవరికో ఇవ్వడం, అవి రియల్ ఎస్టేట్‌ లో పెట్టుబడులుగా మారడం… ఇలాంటి ధోరణులెన్నో పార్టీలో అంతర్గతంగా ఎన్నో ఏళ్లుగా అసంతృప్తిని రాజేస్తూనే ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పుడేమీ కొత్త కాదుగా అనే భావన వచ్చింది. ఇన్నేళ్లూ చూసీ చూసీ ఇప్పుడు కేంద్ర కమిటీ ఇక తప్పదని కొరడా పట్టుకుందా..? అని ప్రశ్నిస్తున్నారు. అసలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించి సీపీఎం ఈ ప్రాంతంలో బాగా నష్టపోయింది… రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావరహితం అయిపోయింది. రాష్ట్ర నాయకుల వ్యక్తిగత రాజకీయ ధోరణులు కూడా కారణమే నంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : gusagusa gusa-gusa political-gusagusa communist-war communist

Related Articles