HBD NAGARJUNA:నాగార్జున సినీ కెరియర్ లో  ఈ 5సినిమాలే అద్భుతం.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఎంతో పేరు తెచ్చుకున్న ఫ్యామిలీల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా  నాగార్జున  తండ్రి పేరును  పదింతలు రెట్టింపు చేశారు. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియో


Published Aug 29, 2024 12:11:16 PM
postImages/2024-08-29/1724913676_HBDNagarjuna.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  ఎంతో పేరు తెచ్చుకున్న ఫ్యామిలీల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా  నాగార్జున  తండ్రి పేరును  పదింతలు రెట్టింపు చేశారు. అంతేకాదు అన్నపూర్ణ స్టూడియోను కూడా  అంచలంచలుగా ఎదిగేలా చేశారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఓ స్టార్ గా ఎదిగిన నాగార్జున  పలు బిజినెస్ లలో కూడా ఆయన పెట్టుబడులు ఉన్నాయి. ఇలా ఎంత ఎదిగిన, ఒదిగి ఉండే నాగార్జున  ఇప్పటికీ బిగ్ బాస్ లో హోస్ట్ గా చేస్తున్నారు.  ఇలా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి నాగార్జున నట వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన కొడుకులు మాత్రం అంతగా ఎదగలేక పోతున్నారు. అలాంటి నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన సినీ కెరియర్ నిలబెట్టినటువంటి టాప్ 5 చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం.

#1. నిన్నే పెళ్ళాడుతా 
 నాగార్జున హీరోగా టబు హీరోయిన్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ చిత్రంలో నాగార్జున చాలా రొమాంటిక్ గా నటించారు. హీరో హీరోయిన్ మధ్య ఉన్నటువంటి లవ్ సీన్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.

#2.శివ
 నాగార్జున సినిమాల గురించి చెప్పుకోవాల్సిన విషయం వస్తే చాలామందికి గుర్తుకు వచ్చేది శివ చిత్రమే. నాగార్జున కెరియర్ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే, దానికి ప్రధాన కారణం శివ సినిమా అని చెప్పవచ్చు. శివకు ముందు ఒకలా శివ తర్వాత మరోలా మారిపోయింది. ఎన్నో మాస్ సినిమాలు వచ్చాయి కానీ శివ సినిమాను అందుకోలేకపోయాయి. విధంగా నాగార్జున కెరియర్ ను గాడిలో పెట్టింది శివ చిత్రమే అని చెప్పవచ్చు. 

#3. శ్రీరామదాసు 
 ఇక నాగార్జున నటించిన భక్తి రస చిత్రాలలో శ్రీరామదాసు కూడా ఒకటి. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి భక్తి రసాభావం ఉట్టిపడుతుంది. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో అద్భుతమైన హిట్ సాధించింది.

#4.  అన్నమయ్య:
 నాగార్జున కెరీర్ ను నిలబెట్టిన చిత్రాల్లో పౌరాణిక చిత్రం అన్నమయ్య. ఇది కూడా రాఘవేంద్రరావు డైరెక్షన్ లోనే వచ్చింది. ఈ సినిమా కూడా అప్పట్లో బాక్సఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

#5. సోగ్గాడే చిన్నినాయన 
 ఇక నాగార్జున కెరియర్ అయిపోయింది అనుకునే సమయంలో  వచ్చినటువంటి సోగ్గాడే చిన్నినాయన మళ్లీ ఆయన ఎదిగేలా చేసింది. ఈ చిత్రం తర్వాత నాగార్జున వరుసగా సినిమాల్లో చేస్తూ దూసుకుపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna shiva hbd-nagarjuna ninne-pelladutha soggade-chinni-nayana annamayya sri-ramadasu

Related Articles