ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రస్తుత పరిస్థితులపై సమీక్షలు జరుపుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలోని విద్యాసంస్థలకు సోమవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రస్తుత పరిస్థితులపై సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. సోమవారం నాడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ సర్కార్ ఉత్తరువులు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.