సీఎం మాటలపై మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు పాలనలో విద్యుత్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ మొత్తం 7700MW కరెంట్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. కేసీఆర్ వచ్చిన తర్వాత 10 ఏండ్లలో 11000 MW ఇచ్చారని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు, ఫార్మ కంపెనీలకు ఒక్క సెకండ్ కూడా కరెంట్ కట్ చేయకుండా సరఫరా చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన కరెంట్ గురించి ప్రస్తావించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు కంపెనీల పెట్టుబడులు రావాలని అంతరాయం లేని కరెంట్ ఇవ్వడానికి ప్రణాళికలు చేశారని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత దాన్ని మరింత విస్తరింపజేసి నిరంతర కరెంట్ అందించారని ఆయన అన్నారు.
సీఎం మాటలపై మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు పాలనలో విద్యుత్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ మొత్తం 7700MW కరెంట్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. కేసీఆర్ వచ్చిన తర్వాత 10 ఏండ్లలో 11000 MW ఇచ్చారని తెలిపారు. 2014 జూన్ 2 వరకు తెలంగాణలో విద్యుత్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7778 MW అయితే ఈ ఏడాది జనవరి 1 వరకు 19483 MW కరెంట్ ఇచ్చారని అన్నారు. అంటే 11705 MW కేసీఆర్ నాయకత్వంలో ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ పెరిగిందని అన్నారు. వీళ్ల 70 ఏండ్ల కాలంలో వీళ్లు ఇచ్చింది 74 MW అయితే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 6132 MWకు తీసుకొని వచ్చామని జగదీష్ రెడ్డి తెలిపారు.
ఇప్పుడేమో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. కరెంట్ పోయినప్పుడు ప్రజలకు సహాయంగా ఉంటుందని BRS అధికారంలో ఉన్న సమయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కానీ, కాంగ్రెస్ వచ్చిన తరువాత అదే హెల్ప్ లైన్.. కరెంట్ పోయిందని హెల్ప్ కోసం ఫోన్ చేసిన వాళ్లపై కేసులు పెట్టేందుకు ఉపయోగపడుతుందని అనుకోలేదని జగదీష్ రెడ్డి అన్నారు. హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు.
చివరికి జర్నలిస్టుల మీద కూడా కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. ఎక్కడైనా పోస్ట్ పెడితే ఆ ప్రాంతంలో విద్యుత్ సరి చేస్తారు. కానీ, ఇప్పుడు పోస్ట్ పెట్టిన వారి ఇళ్లలోకి వెళ్లి డిలీట్ చేయకుంటే కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన వెల్లడించారు. హెల్ప్ కోసం ఫోన్ చేస్తే కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు.