కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా ధ్వంసమైందని.. వరద ప్రవాహాన్ని తట్టుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతంలో ఒకసారి బీఆర్ఎస్ మేడిగడ్డను సందర్శించింది. తాజాగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ క్రమంలో మేడిగడ్డకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. అయినప్పటికీ మేడిగడ్డ బ్యారేజీ తట్టుకొని నిలబడింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ సామర్థ్యం కోల్పోలేదని.. నిరూపించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్లతో పాటు పలు బ్యారేజీల సందర్శనకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డను సందర్శించిన అనంతరం కేటీఆర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.