తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ అంటే తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత హీరోగా మారాడు. ఇప్పటికి గోపీచంద్ స్టార్ హీరోగా మాత్రం పేరు
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ అంటే తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత హీరోగా మారాడు. ఇప్పటికి గోపీచంద్ స్టార్ హీరోగా మాత్రం పేరు తెచ్చుకోలేకపోతున్నాడు. ఆయన కెరియర్ లో వచ్చిన సినిమాలన్నింటిలో ఎక్కువ ఫ్లాప్లే ఉన్నాయి. అయినా గోపీచంద్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలు చేస్తూ హిట్స్, ప్లాప్స్ అనే తేడా లేకుండా దూసుకుపోతున్నారు.
అలాంటి ఆయన తాజాగా హీరోగా చేసినటువంటి మూవీ విశ్వం. ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాలయ స్టూడియో బ్యానర్ పై వచ్చినటువంటి ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. "మురాకన్ మగువ" అంటూ సాగె ఈ సాంగ్ మ్యూజిక్ ఎంతో బాగుంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా కోసం గోపీచంద్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అలాంటి ఈ సమయంలో సాంగ్ రిలీజ్ చేయడంతో మంచి ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ మూవీ యాక్షన్, కామెడీ, ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. దసరాకు రిలీజ్ అవ్వనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో నరేష్, ప్రగతి, సునీల్, వెన్నెల కిషోర్, కిక్కు శ్యామ్, ప్రధాన పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.