ఆదివారం కురిసిన భారీ వర్షాలకు కేసముద్రం, ఇంటకన్నెలను కలిపే ఇంటకన్నె రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు. ట్రాక్ తెగిపోవడంతో నీరు దాని నుండే ప్రవహిస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: గత రెండు రోజులుగా తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎక్కడ చూసినా నీరు వరదగా కొట్టుకుపోతోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. అయితే, మహబూబాబాద్ వద్ద వరదల కారణంగా రైల్వే ట్రాక్ దెబ్బతినంట్లు తెలుస్తోంది.
ఆదివారం కురిసిన భారీ వర్షాలకు కేసముద్రం, ఇంటకన్నెలను కలిపే ఇంటకన్నె రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు. ట్రాక్ తెగిపోవడంతో నీరు దాని నుండే ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ట్రాక్‌ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ట్రాక్ పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్‌లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఆ మార్గంలో వెళ్లే రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.