దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలను నిశితంగా పరిశీలిస్తే గనుక ఆయన సినిమాలో "An S.S. Rajamouli Film" అనే ఒక ముద్ర ఉంటుంది. అయితే ఎస్ ఎస్ రాజమౌళి ఫిల్మ్ అనే ముద్ర ఉండటం వెనుక ఒక షాకింగ్ స్టోరీ ఉందట.
న్యూస్ లైన్ డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలను నిశితంగా పరిశీలిస్తే గనుక ఆయన సినిమాలో "An S.S. Rajamouli Film" అనే ఒక ముద్ర ఉంటుంది. అయితే ఎస్ ఎస్ రాజమౌళి ఫిల్మ్ అనే ముద్ర ఉండటం వెనుక ఒక షాకింగ్ స్టోరీ ఉందట. మరి ఇంతకీ రాజమౌళి తన ప్రతి సినిమాకి స్టాంపు ఎందుకు వేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి అంతకంటే ముందే శాంతి నివాసం అనే సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు.
ఆ తర్వాత రాజమౌళి రాఘవేంద్రరావు పర్యవేక్షణలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకి పూర్తిగా రాఘవేంద్ర రావే చూసుకోవడం వల్ల అది తన సినిమా అనే ఫీలింగ్ రాలేదట. ఆ తర్వాత ఈయన తీసిన సింహాద్రి సినిమా సొంతంగా తీశారు కాబట్టి. అది నా సినిమా అనే భావన రాజమౌళికి కలిగిందట.దాంతో ఈ సినిమా చివర్లో An S.S. Rajamouli film అనే స్టాంపు వేస్తానని చెప్పారట. కానీ నిర్మాత మాత్రం ఈ సినిమా మీ ఒక్కడి కృషి ఎలా అవుతుంది.
ఇందులో అందరి సహకారం ఉంది కదా అని చెప్పారట.కానీ ఆ తర్వాత వచ్చిన సై సినిమా నుండి రాజమౌళి an s.s. Rajamouli film అనే స్టాంపు వేయడం స్టార్ట్ చేశారు. అప్పట్నుండి తన సినిమా టైటిల్స్ కి ఈ స్టాంపు గుర్తింపుగా మారిపోయింది. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకు ఆ స్టాంపుని తీసేయాలి అనుకున్నారట. ఎందుకంటే బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా జనాల్లోకి వెళ్ళిపోతుంది అని భావించారట.అయితే ఇదే తనతో సినిమాలు చేసే వారికి చెబితే నో నో మీ సినిమా టైటిల్స్ లో మీ స్టాంపు అనేది ఒక బ్రాండ్ గా మారిపోయింది.
ఈ స్టాంపును తీసేస్తే మీ సినిమా అనే ఫీలింగ్ పోతుంది. మీ సినిమా అనే భావన రావాలంటే ఖచ్చితంగా ఆ స్టాంపు ఉండాల్సిందే. ఒకవేళ ఈ స్టాంపు తీసేస్తే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇబ్బంది పడతారు. ఆయన సినిమాపై ఆయనకే నమ్మకం లేదు. అందుకే సినిమాపై తన పేరు స్టాంపు వేసుకోలేదు అని జనాల్లోకి వేరుగా వెళుతుంది. అందుకే మీరు ఈ స్టాంపు ని కొనసాగించాలి అని సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది చెప్పారట.దాంతో దాన్ని అలాగే కొనసాగిస్తున్నట్టు రాజమౌళి ఇటీవల తన డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని పంచుకున్నారు