ఓ ఆవు కడుపులో 70 కేజీలకు పైగా ప్లాస్టిక్ ను తొలగించి..గోవు ప్రాణాన్ని కాపాడారు పశువు వైద్యులు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్లాస్టిక్ కారణంగా ఎన్నో వేల సంఖ్యలో మూగజీవులు ఇబ్బందులు పడుతున్నారు. మనం తిని పడేసిన ప్లాస్టిక్ రేపర్లు..కవర్లు...అందులో ఏదైనా ఫుడ్ సగం తిని కవర్ చుట్టు పడేస్తాం..ఆ ఫుడ్ కోసం ఆవులు..గేదెలు తింటున్నాయి. దీని వల్ల ఎన్నో ఆవులు తిని చనిపోతున్నాయి .రీసెంట్ గా కర్నూలు జిల్లాలో జరిగిన ఓ వింత సంఘటన జంతుప్రేమికులకు కన్నీళ్లు పెట్టించాయి. ఓ ఆవు కడుపులో 70 కేజీలకు పైగా ప్లాస్టిక్ ను తొలగించి..గోవు ప్రాణాన్ని కాపాడారు పశువు వైద్యులు.
ఎమ్మిగనూరులో రోడ్డుపై పడి ఉన్న ఒక గోవును చూశాడు. పాపం లేచి తినలేక...నడవలేక పడి ఉన్న గోవును న్యాయవాది బోయతిమ్మప్ప ఆసుపత్రికి తరలించారు. భారీ కడుపుతో ఆయాసంతో నడవలేక అవస్థపడుతున్న గోవును చూసి కన్నీళ్లుపెట్టుకున్నారు. మనం చేసే తప్పులకు గోవులు ...కష్టాలుపడుతున్నాయని వాపోయారు. కొన ఊపిరితో ఉన్న ఆవును ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు 70 కేజీలకు పైగా ప్లాస్టిక్ ను ఆపరేషన్ చేసి తొలగించారు.
ప్రస్తుతం గోవు ఆరోగ్యం నిలకడగా ఉందని పశు వైద్యులు తెలిపారు. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్రజలు కూడా అమలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. దయచేసి ప్లాస్టిక్ కవర్లో ఫుడ్ చుట్టి పడేయకండి అంటూ డాక్టర్లు చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.