horoscope: ఈ రోజు ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం !

ఎంతో కొంత మంచి చెయ్యడానికి చాలా ప్రయత్నిస్తుంది.  శుక్రనక్షత్రా జాతకులకు ఆకస్మిక శుభఫలితాలు ఇస్తాడు.


Published Apr 29, 2025 06:02:00 AM
postImages/2025-04-29/1745886850_rasiphalalutoday.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బుధుడు స్వనక్షత్రమైన రేవతిలోకి ప్రవేశిస్తున్నాడు . నీచలో ఉన్నప్పటికి  సొంతనక్షత్రంపై సంచరించడం వల్ల తన ఆదిపత్యం చూపిస్తుంది. అంతేకాదు వారికి ఎంతో కొంత మంచి చెయ్యడానికి చాలా ప్రయత్నిస్తుంది.  శుక్రనక్షత్రా జాతకులకు ఆకస్మిక శుభఫలితాలు ఇస్తాడు. వెరసి మేషం మిథునం , కర్కాటకం , సింహం , కన్య, దనస్సు , మీనరాశుల వారికి బుధుడు అనుగ్రహం ఈ రోజు చక్కగా ఉంటుంది.


మేషం: ఈ రోజు అనుకూలంగా ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. భూమి తగాదాలు ఏమైనా ఉంటే ఈ రోజు క్లియర్ అవుతాయి. అంతేకాదు ఈ రోజు హ్యాపీగా రావాల్సిన డబ్బులు వస్తాయి. అంతేకాదు ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతారు.


వృషభం: బంధుమిత్రులను కలుసుకుంటారు. విద్యార్ధులు కష్టానికి తగ్గ ఫలితం ద్కుతుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితం ఉంటాయి. ఆర్ధిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. సూర్యుని ఆరాధన చాలా మంచిది. 


మిథునం: ఈ రోజు అదృష్టం తలుపు తడుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. భూ లావాదేవీల్లో లాభం చేకూరుతుంది. కీలక విషయాల్లో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు.


కర్కాటకం: ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. పెద్దల అండదండలు పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. 


సింహం: నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న విషయాలు చాలా చక్కగా జరుగుతాయి. 


కన్య: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్ధులకు బాగా కలిసి వస్తుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు.


తుల: గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆలోచనలు అమలుచేయడంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. 


వృశ్చికం: పెద్దల సూచనలు, సలహాలు పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకొండి. కాలం కలిసివస్తుంది.


ధనుస్సు: ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. 


మకరం: సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు జాగ్రత్త . భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా..ఈ రోజు కాస్త గొడవలు జరిగే రోజే. కాబట్టి జాగ్రత్త.


కుంభం: గ్రహస్థితి ఆశాజనకంగా లేదు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. దూరప్రయాణాలు ప్లాన్ ఉంటే కాస్త వాయిదా వేసుకొండి.


మీనం: శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి , అనూకలంగా కూడా ఉంటుంది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi

Related Articles