మన హిందూ వేదాల్లో పూజ కాని వ్రతం కాని ..మండలం రోజులు చేస్తే ఖచ్చితంగా మన శరీర , మానసిక ఆరోగ్యం భగవంతునికి దగ్గరగా వెళ్తుందని నమ్ముతారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అంజనీ పుత్ర ..పవనసుత రామ ..కలియుగ దైవం శ్రీ ఆంజనేయుని జయంతి నేడు. అయితే హనుమాన్ ని ప్రసన్నం చేసుకోవడానికి 40 రోజుల పాటు వ్రత దీక్ష తీసుకుంటారు. హనుమంతుడి అనుగ్రహం కోసం చేసే ఉపవాసం భక్తి,శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అయితే 40 రోజుల దీక్ష సమయంలో ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం, పూజ చేస్తారు.సాత్విక ఆహారం తీసుకుంటారు. మన హిందూ వేదాల్లో పూజ కాని వ్రతం కాని ..మండలం రోజులు చేస్తే ఖచ్చితంగా మన శరీర , మానసిక ఆరోగ్యం భగవంతునికి దగ్గరగా వెళ్తుందని నమ్ముతారు.
హిందువులు హనుమాన్ బలం , భక్తి , విధేయతకు చిహ్నంగా భావిస్తారు. హనుమాన్ కు 40 రోజుల పాటు పూజలు చేస్తే ఆయన కరుణ మనపై ఉంటుందని నమ్ముతారు. ఈ 40 రోజుల పాటు ప్రతిరోజూ హనుమంతుడిని పూజించాలి. పువ్వులు, సింధూరాన్ని సమర్పించాలి. హనుమంతుడికి ఇష్టమైన శనగలు, అరటిపండ్లు వాటిని నైవేధ్యంగా సమర్పించాలి. ఈ 40 రోజులు నేల మీద పడుకోవాలి. ఈ 40 రోజులు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చాలా ముఖ్యం . అయితే మీకు ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు హనుమాన్ చాలీసా చదవండి.
ఉల్లిపాయ, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
ఈ రోజుల్లో బ్రహ్మచర్యం కూడా చాలా ముఖ్యం.
ఈ వ్రతం టైంలో దానం , ధర్మం చేస్తే మీ మనసు హనుమాన్ కు మరింత దగ్గరగా వెళ్తుంది
ఈ వ్రతం వల్ల కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారు.