గురు గ్రహం 2025 జూన్ 12వ తేదీ గురువారం రాత్రి 07:56 గంటలకు మిథునరాశిలో అస్తమిస్తుంది. తిరిగి 2025 జూలై 9వ తేదీ బుధవారం ఉదయం 04:45 గంటలకు మిథునరాశిలో ఉదయిస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మంచి ముహూర్తాల కోసం ఎదురు చూసే వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురు గ్రహం సూర్యుని తరువాత సౌర వ్యవస్థ లో అతి పెద్ద గ్రహం గురుగ్రహం . గురువు మంచి స్థితిలో ఉన్న జాతకాలకే మంచి జరుగుతుంది. అదే గురువు కాని నీచ స్థితిలో ఉంటే మనం అనుకున్న పనులు అవ్వవు. ఒక్కోసారి గురువు మంచి స్థితి అస్తమించడం వల్ల గురు మూఢం వస్తుంది. ఈ మూఢం వచ్చినపుడు అసలు మంచి ముహూర్తాలు ఉండవు. ఏ శుభకార్యాలు ఉండవు. గురు గ్రహం అస్తమించడం వల్ల దాని శక్తి తగ్గుతుంది. గురు గ్రహం 2025 జూన్ 12వ తేదీ గురువారం రాత్రి 07:56 గంటలకు మిథునరాశిలో అస్తమిస్తుంది. తిరిగి 2025 జూలై 9వ తేదీ బుధవారం ఉదయం 04:45 గంటలకు మిథునరాశిలో ఉదయిస్తుంది.
ఎవ్వరి జాతకంలో అయినా మంచి రోజులు రావాలంటే గురువు స్థితి బాగుండాలి. కాని గురువు ఇప్పుడు అస్తమించడం వల్ల ఎలాంటి మంచిరోజులు ఉండవు. కాబట్టి శుభకార్యాలు చెయ్యారు. కొన్ని సార్లు ఈ గురు మూఢం కూడా కొన్ని జాతకాలకు నప్పుతుంది. అంటే కలిసివస్తుంది. ఏ జాతకాలకు బాగుంటుందో చూద్దాం.
మేష రాశి : మేషరాశిలో గురు గ్రహం తొమ్మిదవ, పన్నెండవ ఇంటికి అధిపతి. మేషరాశిలో గురుమూఢం మూడవ ఇంట్లో సంభవిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. అంతేకాదు ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది.
వృషభ రాశి : వృషభ రాశిలో గురు గ్రహం ఎనిమిదవ, పదకొండవ ఇంటికి అధిపతి. వృషభరాశిలో గురుమూఢం రెండవ ఇంట్లో సంభవిస్తుంది. మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మీకు ఇది కలిసి వచ్చే కాలం. మీరు అనుకున్న టైం కలిసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఆస్తులు సమకూర్చుకోవాలి.
తుల రాశి వారికి గురు గ్రహం మూడవ, ఆరవ ఇంటికి అధిపతి. తులారాశిలో గురుమూఢం తొమ్మిదవ ఇంట్లో సంభవిస్తుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులు మధ్య అనుబంధం దృఢ పడుతుంది. కుటుంబ సభ్యులు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటారు.
మకర రాశి : మకర రాశి వారికి గురు గ్రహం పన్నెండవ, మూడవ ఇంటికి అధిపతి. మకర రాశిలో గురుమూఢం ఆరవ ఇంట్లో సంభవిస్తుంది. ఈ ప్రభావంతో కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న జీవితం మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.
మీన రాశి : మీన రాశి వారికి గురు గ్రహం మొదటి, నాల్గవ ఇంటికి అధిపతి. మీనరాశిలో గురుమూఢం నాలుగవ ఇంట్లో సంభవిస్తుంది. ఈ ప్రభావంతో ఆదాయ వనరులు పెరుగుతాయి. మీకు ఇప్పుడు వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులు కోకూడదు.ఇదే మీ జీవితానికి కీలక మలుపు.