BHAKTHI: కష్టాల నుంచి కాపాడే ..అనంతపద్మనాభవత్రం !

కడలిగెరుగు కలియుగ కష్టాలు ...అలాంటి కష్టాలను కూడా స్వామి దయతలచి విముక్తి కలిగిస్తారు.స్వామి రూపంలో స్థితి మాత్రమే గోచరించదు.


Published Sep 16, 2024 04:18:00 PM
postImages/2024-09-16/1726483826_c13e5613345305944dd9642e05d678f7.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:అనంత పద్మనాభస్వామి వ్రతం రేపే , కడలిగెరుగు కలియుగ కష్టాలు ...అలాంటి కష్టాలను కూడా స్వామి దయతలచి విముక్తి కలిగిస్తారు.స్వామి రూపంలో స్థితి మాత్రమే గోచరించదు. సృష్టికర్తతోపాటు, లయకారుడి తత్వాలూ స్వామి చిత్తరువులో దర్శనమిస్తాయి.భూ భారాన్ని మోసే..అనంతపద్మనాభుడుకి పూజలు చేయడం వల్ల మన భుజాల మీద ఉన్న బాధ్యతల భారాన్ని తగ్గిస్తారనేది లోక సూక్తి.


కావేటి రంగడు మన తెలుగు రాష్రాల్లో రంగనాథుడిగా..ఆ స్వామి సేవలో తరించే అవకాశం కల్పిస్తున్నారు.‘అనంత పద్మనాభ వ్రతం’. భాద్రపద శుద్ధ చతుర్దశి సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కష్టాలు తీరిపోవాలంటే కోరికలు నెరవేరావాలని ఈ వ్రతం నిర్వహిస్తారు. అరణ్యవాసంలో ఉన్న పాండవులు.. శ్రీకృష్ణుని సలహా మేరకు అనంత పద్మనాభ వ్రతం చేశారని పురాణ కథనం. 
ఈ పూజ ఎలా చేస్తారంటే ..
పిండితోగానీ, దర్భలతోగానీ ఏడు పడగల సర్పాన్ని తయారుచేసి అష్టదళ పద్మమంటపంపై గానీ, కలశంపై గానీ అనంతస్వామిని ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు నిర్వర్తిస్తారు. కలశంలో పవిత్ర జలాలలో యమునా నదిని ఆవాహన చేసి ఈ వ్రతాన్ని కొనసాగించాలి. పూజలో భాగంగా 14 ముడులు కలిగిన తోరణాన్ని ఉంచుతారు. తోరాలలోని 14 ముడులు ఒక్కో దేవతకు సంకేతంగా చెబుతారు.


దిక్పాలకులు, రవి, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, యముడు, బ్రహ్మ, చంద్రుడు, జీవుడు, శివుడు, వాయువు, అశ్విని దేవతల సాక్షిగా వ్రతాన్ని ఆచరిస్తున్నామని ఈ ముడుల ద్వారా తెలియజేస్తారు. ఈ వ్రతాన్ని చతుర్దశి వ్రతం అనీ , కదళీ వ్రతం అని పిలుస్తారు. ఒక సారి ఈ వ్రత దీక్షను స్వీకరించిన దంపతులు ఏటా తప్పక ఉపవాసం ఉండాలి.కుదరని పక్షంలో ఎవరైనా వ్రతంలో ఉంచిన తోరాలనైనా తప్పనిసరిగా ధరించాలని పెద్దలు చెబుతారు. పౌర్ణమి తో కూడిన చతుర్ధశి ఈ వ్రతానికి అనువైన సమయం.


ఈ పూజలో కంపల్సరీ ఏడుకు ప్రాధాన్యత నివ్వాలి. అష్టదిక్పాలకులకు ఈ పూజను చేస్తూ ...స్వామి వారి పూజకు యధాశక్తి పూజించాలి. 28 గోధుమ పిండి తో కాని వరి పిండితో కాని అరిసెలు చేసి..స్వామి వారికి అర్పించాలి. అంతేకాదు తోరణాన్ని మరిచిపోకుండా కట్టుకోవాలి. ఈ పూజ మొత్తం ఈ తోరణంతోనే లింక్ అయ్యి ఉంటుంది. పూజను యుమునా మాతను ఆరాధించాలి. పూజను కష్టకాలంలో చేస్తే మంచి జరుగుతుందని ప్రతి హిందువు నమ్ముతారు.

newsline-whatsapp-channel
Tags : bhakthi sri-maha-vishnuvu pooja vishnu

Related Articles