Laxmi Devi:ఆర్థికంగా చితికిపోయారా.. ఈ చిన్న రెమెడీతో ధనవంతులవ్వడం ఖాయం.!

కొంతమంది  ఎంతో కష్టపడి ధనం సంపాదిస్తూ ఉంటారు. కానీ ఈ డబ్బు అనేది వారి చేతిలోకి వచ్చిందంటే ఇట్టే మాయమైపోతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని కాపాడుకోలేక పోతారు. అలా


Published Aug 27, 2024 07:07:07 AM
postImages/2024-08-27/1724722627_laxmidevi.jpg

న్యూస్ లైన్ డెస్క్: కొంతమంది  ఎంతో కష్టపడి ధనం సంపాదిస్తూ ఉంటారు. కానీ ఈ డబ్బు అనేది వారి చేతిలోకి వచ్చిందంటే ఇట్టే మాయమైపోతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని కాపాడుకోలేక పోతారు. అలా ఎంత సంపాదించినా, ఆర్థికంగా వెనుకబడిపోతున్న కుటుంబాలు అనేకం ఉంటూ ఉంటాయి. మరి అలాంటివారు ఈ చిన్న రెమిడీతో ఆర్థికంగా కష్టాలను పోగొట్టుకొని ధనవంతులు అవ్వండి. ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. లక్ష్మీదేవి అనేది మన సంపదకు ప్రతిరూపం.

అలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తే మనం ఆర్థికంగా,  సామాజికపరంగా ఎంతో బలపడతాం. ఇలాంటి లక్ష్మీదేవి తల్లిని శుక్రవారం లేదా మంగళవారం రోజున కానీ ఈ రెమిడితో పూజించాలి.. ఒక గాజు పాత్రలో కల్లుప్పు తీసుకొని, దానిపై పసుపు, కుంకుమ చల్లాలి. ఆ తర్వాత అదే ఉప్పుపై ఉప్పు కనిపించకుండా గందం నిండారుగా చల్లుకోవాలి. గంధం ఎందుకు చల్లుకోవాలంటే లక్ష్మీదేవికి గంధం అంటే చాలా ఇష్టం.

ఈ విధంగా పసుపు, కుంకుమ, గంధం పూర్తిగా కల్లుప్పుపై చల్లిన తర్వాత, ఆ ఉప్పుపై ఒక రూపాయి కాయిన్ పెట్టి పూజ గదిలో ఈ గాజు పాత్రను శుక్రవారం కానీ మంగళవారం కానీ పూజా రూములో లక్ష్మీదేవి ముందు పెడితే మనకు డబ్బుకు కొదువుండదట. అంతేకాదు ఆర్థికపరమైన సమస్యలు దూరమై  ధనవంతులవుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ చిన్న చిట్కాతో ధనవంతులైపోండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu laxmidevi laxmi-devi-pooja big-salt pooja-room rich-

Related Articles