Astrology:శుక్ర, సూర్య కేతువులు సంయోగం..ఈ 3 రాశుల వారికి గోల్డెన్ లైఫ్.!

జ్యోతిష్య శాస్త్రంలో  కాలం మారినా కొలది గ్రహాల సంయోగం అనేది  జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒకే రాశిలోకి గ్రహాల సంయోగం జరగడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని


Published Sep 05, 2024 07:10:55 AM
postImages/2024-09-05/1725500455_rashulu.jpg

న్యూస్ లైన్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రంలో  కాలం మారినా కొలది గ్రహాల సంయోగం అనేది  జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒకే రాశిలోకి గ్రహాల సంయోగం జరగడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఉంటాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత శుక్రుడు, సూర్యుడు, కేతువు గ్రహాలు కన్య రాశితో సంయోగం   చేయబోతున్నాయి. దీంతో ఈ మూడు రాశులపై ఎఫెక్ట్ పడుతుందట.  ఆ  ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అనే వివరాలు చూద్దాం..

#1. మేషరాశి :
 శుక్రుడు, కేతువు, సూర్యుడు సంయోగం కారణంగా  ఈ రాశి వారికి కుటుంబంలో ఉన్న విభేదాన్ని తొలగిపోయి హ్యాపీగా జీవిస్తారట. అంతేకాకుండా వీరికి ఆకస్మిక ధన లాభం కూడా ఉంటుందట. ఉద్యోగాలు చేసేవారైతే ప్రమోషన్స్ పొందుతారట.  జీవితం అద్భుతంగా ముందుకు వెళుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

#2. సింహరాశి:
 ఈ గ్రహాల సంయోగం కారణంగా సింహ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయట. ముఖ్యంగా  చదువుకునే విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారట. అలాగే విద్యార్థులకు ఆలోచన శక్తి పెరిగి  అన్ని మంచి ఫలితాలు పొందుతారట. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తారట. కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయట. 

#3. కన్యా రాశి :
 ఈ యొక్క గ్రహాల సంయోగం కారణంగా కన్య రాశి వారికి అన్నీ మంచి ఫలితాలే ఉంటాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయట. అనారోగ్య సమస్యలు ఉంటే కూడా సెట్ అయిపోతాయట. వ్యాపార రంగంలో దూసుకుపోతారట. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ క్లియర్ అయిపోయి ఆనందంగా జీవిస్తారని శాస్త్ర పండితులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line aries leo rashi-palalu virgo golen-life

Related Articles