భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఈ దేశంలో మనిషి పుట్టినా, చచ్చినా సాంప్రదాయం ప్రకారమే అన్ని నియమాలు పాటిస్తారు. ఇలా ఏ పని చేసిన జాతకాలు ముహూర్తాలు చూసే చేస్తూ ఉంటారు. అలాంటి మన భారత దేశంలో కొత్త వాహనాలు ఏవైనా కొన్నప్పుడు దానికి నిమ్మకాయలు, మిరపకాయలు, తప్పనిసరిగా కడతారు.అంతేకాకుండా ఆ వాహనాన్ని తీసుకువచ్చే సమయంలో టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి వాటిని తొక్కించుకొని వస్తూ ఉంటారు. మరి అలా కొత్త వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు అనే వివరాలు చూద్దాం..
న్యూస్ లైన్ డెస్క్: భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఈ దేశంలో మనిషి పుట్టినా, చచ్చినా సాంప్రదాయం ప్రకారమే అన్ని నియమాలు పాటిస్తారు. ఇలా ఏ పని చేసిన జాతకాలు ముహూర్తాలు చూసే చేస్తూ ఉంటారు. అలాంటి మన భారత దేశంలో కొత్త వాహనాలు ఏవైనా కొన్నప్పుడు దానికి నిమ్మకాయలు, మిరపకాయలు, తప్పనిసరిగా కడతారు.అంతేకాకుండా ఆ వాహనాన్ని తీసుకువచ్చే సమయంలో టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి వాటిని తొక్కించుకొని వస్తూ ఉంటారు. మరి అలా కొత్త వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు అనే వివరాలు చూద్దాం..
కొంతమంది కొత్త బండి ఏదైనా గుడికి లేదా పండితుల దగ్గరికి తీసుకెళ్లి పూజ చేయించుకొని ఆ తర్వాత వాహనాల టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించుకొని వస్తుంటారు. ఇలా నిమ్మకాయను ఎందుకు తొక్కిస్తారంటే అదే వాహనం టైర్ కింద పడి చనిపోయే మొదటి మరియు చివరిది నిమ్మకాయ కావాలని భావిస్తారట. కానీ అసలు రీజన్ ఇది కాదట. పూర్వకాలంలో ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయటానికి గుర్రపు బండి, ఎద్దుల బండి ఉపయోగించేవారు. అప్పట్లో ప్రయాణ మార్గాలు కూడా రాళ్లు, రప్పలు, అడవుల మీదుగా ఉండేవి. ఆ సమయంలో గుర్రాలు లేదంటే ఎద్దుల కాళ్లకు పగుళ్లు, రాళ్ల వల్ల గాయాలు అయితే వాటి కాళ్లకు పుండ్లు ఏర్పడేవి.
. దానివల్ల అవి నడవకుండా అయిపోయేవి. అందుకే పూర్వకాలంలో వారు గుర్రాలు లేదా ఎద్దుల కాళ్ళ కింద నిమ్మకాయల ఉంచి వాటిని తొక్కించుకుంటూ వెళ్లేవారు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ వాటి కాళ్లలోకి వెళ్లి క్రిమి, కీటకాలు ఏమైనా బ్యాక్టీరియాలు ఉంటే నశింపజేసి వాటి కాళ్ళకి హాని కలవకుండా చేస్తాయి. ఇదే రాను రాను వెహికల్స్ కింద కూడా పెట్టడం అలవాటైపోయింది. కానీ దీన్ని మూఢనమ్మకం అనవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాహనాలకు రబ్బరు టైర్లు ఉంటున్నాయి. వాటికింద నిమ్మకాయలు పెట్టాల్సిన అవసరం లేదు.