ఏ రాశి లో సంచరిస్తాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 14 న రాత్రి 11.20 గం మిథునరాశిలోకి బృహస్పతి అడుగు పెట్టనున్నాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బృహస్పతి దేవు గురువు . బృహస్పతి జ్ఞానం, విద్య , ఆధ్యాత్మికతకు అధిపతిగా పరిగణించబడుతున్నాడు. బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటారు. గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఒక రాశి నుంచి వెళ్లిన తర్వాత అదే రాశిలోకి అడుగు పెట్టడానికి 12 యేళ్లు పడతాయి. ఏ రాశి లో సంచరిస్తాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 14 న రాత్రి 11.20 గం మిథునరాశిలోకి బృహస్పతి అడుగు పెట్టనున్నాడు.
* మేషరాశి: మానసిక ఒత్తడి, అలసట వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. వీరు గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం శుభాఫలితలను అందిస్తుంది.
* వృషభ రాశి: బృహస్పతి మిథునరాశిలోకి వస్తుంది. వ్యక్తుల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం , శాంతి నెలకొంటుంది. అంతేకాదు శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. ఈ రాశికి వారు గురువు అనుగ్రహం కోసం గురువారం బృహస్పతికి సంబంధించిన మంత్రాలను జపించడం మంచిది.
* మిథున రాశి: కెరీర్ లో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విదేశీ ప్రయాణం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు పెసర పప్పుని దానం ఇవ్వడం శుభప్రదం.
* కర్కాటక రాశి: వీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ముఖ్యంగా జీర్ణ సమస్యలు , ఒత్తిడికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. గురువు అనుగ్రహం కోసం గురువారం బృహస్పతికి సంబంధించిన మంత్రాలు జపించండి.
* సింహరాశి: ఉద్యోగులు ఆఫీసులో తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మానసికంగా బలంగా ఉండే ప్రయత్నం చేయండి.
* కన్య రాశి: విదేశాల్లో పనిచేసే ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. జీతం పెరుగుదల ఉంటుంది. వీరు బృహస్పతి అనుగ్రహం కోసం పుష్పరాగం ధరించడం మంచిది.
* తుల రాశి: ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. వీరు రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు నుదిటిన కుంకుమ ధరించడం మంచిది. ఆర్ధికంగా చాలా ఇబ్బందిపడతారు.
* వృశ్చిక రాశి: అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు పరిహారం కోసం గురువారం 108 సార్లు ఓం అని జపించాలి. వ్యాపారంలో పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యం, వారసత్వం సంబంధాలలొ నమ్మకం, పారదర్శతను కాపాడుకోవాలి.
* ధనస్సు రాశి: వీరు పెట్టుబడుల్లో ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలను చేసే అవకాశం ఉంది.
* మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు.
* కుంభ రాశి: వీరిపై బృహస్పతి సంచారం ప్రభావం చూపుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులతో లాభాలను అందుకుంటారు.
* మీన రాశి: రియల్ ఎస్టేట్, గృహ సంబంధిత వ్యాపారంలో పెట్టుబడులతో లాభాలను అందుకుంటారు. ఈ రాశికి చెందిన వారు గురువు అనుగ్రహం కోసం గురువారం అరటిచెట్టుకి పసుపు కలిపిన నీళ్లు పోయడం మంచి పరిహారం.