బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం కనిపించగానే భక్తజనం పరవశించిపోయారు. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అయోధ్య రామ మందిరంలో అధ్భుత దృశ్యం కనిపించింది. బాలరాముని నుదిట సూర్యతిలకం ఆవిషృతమైంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం లో ఈ రోజు ఉదయం సూర్య తిలకం స్వామి వారి ముఖంపై అధ్భుతంగా కనిపించింది. బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం కనిపించగానే భక్తజనం పరవశించిపోయారు. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
కాగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని అయోధ్య రామ మందిరంలో వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామ నవమి ఇది. శ్రీరామ నవమి సందర్భంగా స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో అయోధ్య చేరుకున్నారు.