ప్రతి యేడాది ఎండలు మొదలయ్యే టైంకి కరోనా కేసులు మొదలవుతున్నాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా హాంగ్ కాంగ్ , సింగపూర్ లాంటి ఆసియా దేశాల్లో గత కొన్ని వారాలుగా ఇన్ ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా , ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మరణాలు కూడా సంభవించడం చాలా టెన్షన్ పడుతున్నారు. దాదాడు ప్రతి యేడాది ఎండలు మొదలయ్యే టైంకి కరోనా కేసులు మొదలవుతున్నాయి. అయితే ఈ సారి మళ్లీ కోవిడ్ కాస్త తీవ్రంగా ఉందంటున్నారు.
గతంలో తీసుకున్న వ్యాక్సిన్ల ద్వారా లభించిన రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గడం, కొత్త కరోనా వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందడమే ఈ ప్రస్తుత ఉద్ధృతికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు నమోదవుతున్న కేసులు 70 శాతం ఎల్ పీ .8.1 అనే కొత్త వేరియంట్ వల్లేనని మరో 9 శాతం ఎల్ పీ 8.1 అనే కొత్త వేరియంట్ వల్లేనని మరో 9 శాతం కేసులకు ఎక్స్ ఎఫ్ సీ వేరియంట్ కారణమని తేలింది. మరోసారి ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు . నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన కొత్త వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. మరోసారి ఈ కరోనా కొత్త వేరియంట్ ఇబ్బందిపెడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.