ఈ ఏడాది బెంగుళూరులో ఇదే అత్యధిక వర్షపాతంగా నగరవాసులు చెబుతున్నారు. సిటీలో కురిసిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టెక్ నగరం బెంగుళూరు లో వర్షం భీభత్సవం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఆరు గంటలు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. బెంగుళూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ ఏడాది బెంగుళూరులో ఇదే అత్యధిక వర్షపాతంగా నగరవాసులు చెబుతున్నారు. సిటీలో కురిసిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం వెల్లడించింది. అలాగే బెంగుళూరు ఉత్తర భాగంలోని వడేరహళ్లిలో 131.5 మిల్లీమీటర్ల వర్షపాతంతో రెండో స్థానంలో నిలిచింది. చాలా ప్రాంతాల్లో రాత్రిపూట 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.