ఈ కేసులో ఆమెకు సాయం చేసిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్ బోర్డర్ లో ముగిసింది. భారత్ లో ప్రతి గల్లీ లో జరుగుతూనే ఉంది. దేశ ద్రోహులను వెతికి పట్టుకుంటున్నారు అధికారులు. అయితే సోషల్ మీడియా లో పాకిస్థాన్ సపోర్ట్ చేసే వారిని అరెస్ట్ చేస్తున్నారు. అయితే పాకిస్థాన్ కు సమాచారం ఇస్తున్న వారిపై భారత్ తీవ్ర చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా హర్యానాకు చెందిన జ్యోతి అనే ట్రావల్ యూట్యూబర్ ను పాకిస్థాన్ గూఢచారిగా పోలీసులు గుర్తించారు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా అనే యువతి, ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్‌కి వెళ్లి, భారత సైనిక సమాచారం అక్కడి ఇంటెలిజెన్స్‌కు పంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమెకు సాయం చేసిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హిసార్ పోలీసుల ప్రకారం, జ్యోతి 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌ను సందర్శించింది. అక్కడ పాకిస్థాన్ పెద్దలతో పాటు ఎహ్సన్- ఉర్ -రహీం అనే ఐఎస్ ఐ ఏజెంట్ తో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత ఆమె పాకిస్థాన్ వెళ్లినిపుడు రహీం ద్వారా భద్రతా అధికారులతో చర్చలు కూడా జరిపింది. అక్కడ షకీర్ , రాణా షాబాజ్ అనే వ్యక్తులతో సీక్రెట్ మాట్లాడినట్లు ఆమె కూడా ఒప్పుకుంది.
తరువాత జ్యోతి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లలో ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కొన్ని డబ్బు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినట్లు తెలిపారు.