ఆషాడం:గోరింటాకు పెట్టుకోవడం మరిచారా అయితే కష్టమే.?

ఆషాడం వచ్చిందంటే చాలు చాలామంది కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు  వారి పుట్టింటికి వెళ్ళి పోతారు. అలాగే ఆషాడం వస్తే మరొక పని కూడా చేస్తారు. అదే గోరింటాకు పెట్టుకోవడం. తప్పకుండా ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది పూర్వకాలం నుంచే వస్తోంది. మరి ఆషాడ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి. దీనివల్ల కలిగే లాభాలు, ఏంటి అనే వివరాలు చూద్దాం..


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721274381_ashadam.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆషాడం వచ్చిందంటే చాలు చాలామంది కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు  వారి పుట్టింటికి వెళ్ళి పోతారు. అలాగే ఆషాడం వస్తే మరొక పని కూడా చేస్తారు. అదే గోరింటాకు పెట్టుకోవడం. తప్పకుండా ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది పూర్వకాలం నుంచే వస్తోంది. మరి ఆషాడ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి. దీనివల్ల కలిగే లాభాలు, ఏంటి అనే వివరాలు చూద్దాం..

మన పూర్వీకులు ఏది చెప్పినా దాని వెనుక ఏదో ఒక సైన్స్ దాగి ఉంటుంది. అంతేకాకుండా మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో  విషయాలుంటాయి.  అలాంటి ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. సాధారణంగా కొత్తగా పెళ్లైన స్త్రీలు ఆషాడం మాసంలో పుట్టింటికి వస్తారు. వీరు గోరింటాకు  అరిచేతిలో పెట్టుకోవడం వల్ల, గర్భానికి సంబంధించిన నాడులు అరి చేతిలో ఉంటాయి కాబట్టి గర్భధారణ తొందరగా అవుతుందని అంటారు.

ఆషాడంలో వర్షారుతువు మొదలవుతుంది కాబట్టి ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. దీనివల్ల నీరు కలుషితం అవుతుంది. వాతావరణం చల్లగా మారడం దీంతో ఒంట్లో వేడి బయట వాతావరణానికి విరుద్ధంగా మారుతుంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి అంతా బయటకు వెళ్ళిపోతుంది. మహిళలు ఎక్కువగా పాత్రలు మరియు దుస్తులను శుభ్రం చేస్తూ ఉంటారు దీనివల్ల వారి చేతులకు, కాళ్లకు క్రీములు వచ్చి చేరుతాయి.

ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఆషాడ మాసం వచ్చిందంటే మహిళలు తప్పక గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ కాలంలో మాత్రం చాలా మంది ఆడపిల్లలు గోరింటాకు చెట్ల నుండి కాకుండా ఆర్టిఫిషల్ గా తయారు చేసింది  పెట్టుకొని మరిన్ని రోగాలు తెచ్చుకుంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits girls ashadamasam laxmidevi gorintaku

Related Articles