మూడు రోజుల పూజలు తర్వాత బ్యాండ్ భాజాలతో నిమజ్జనానికి తీసుకొని వెళ్లి బంగారు గొలుసు విషయం మరిచిపోయి నిమజ్జనం చేసేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గణపతికి మనం వెండి వస్తువులు ఎలా అయితే వేస్తామో ..కొన్ని ప్రాంతాల్లో బంగారు వస్తువులు అలా వేస్తారు. గణపతి అంటే ఇష్టంతో చాలా మంది ఇలా చేస్తుంటారు. అయితే బెంగుళూరు కి చెందిన ఓ ఫ్యామిలీ గణేశునికి ఇష్టంతో ఆరు తులాల బంగారు గొలుసు వేసి పూజలు చేశారు. మూడు రోజుల పూజలు తర్వాత బ్యాండ్ భాజాలతో నిమజ్జనానికి తీసుకొని వెళ్లి బంగారు గొలుసు విషయం మరిచిపోయి నిమజ్జనం చేసేశారు.
గోవిందరాజనగర్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రామయ్య మరియు ఉమాదేవి పండుగలో భాగంగా తమ ఇంట్లో గణేష్ విగ్రహాన్ని ఉంచారు. పూజా సమయంలో 60 గ్రాముల బంగారు గొలుసుతో విగ్రహాన్ని అలంకరించారు. మొబైల్ ట్యాంక్ కు నిమజ్జనానికి తీసుకొని వెళ్లి బంగారు గొలుసు విషయం మరిచిపోయి విగ్రహాన్ని నీటిలో వేసేశారు. ఇంటికి వచ్చాక గొలుసు విషయం గుర్తువచ్చింది.
వారు తిరిగి మొబైల్ ట్యాంక్ వద్దకు వెళ్లి బంగారు గొలుసు గురించి అధికారులకు సమాచారం అందించారు. “ట్యాంక్ వద్ద ఉన్న అబ్బాయిలు మునిగిపోతున్నప్పుడు గొలుసును గమనించామని, అయితే అది నకిలీదని భావించినట్లు చెప్పారు. దాని కోసం దాదాపు 10 గంటలు వెతికితే ఆ గొలుసు దొరికింది.బంగారు గొలుసు కోసం దాదాపు 10వేల లీటర్ల నీటిని పంప్ చేశారు. ఆరుగురు కష్టపడితే గొలుసు దొరికింది. తెల్లవారే ఆ ఇంటి వారికి గొలుసు దొరికినట్లు సమాచారం ఇచ్చారట. గణేశా...వచ్చే యేడాది పూల మాల కూడా పది సార్లు వెతుక్కునేలా చేశావ్ కదయ్యా..