న్యూస్ లైన్ డెస్క్ : వరద బాధితుల సాయం కోసం బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విరాళం ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వం కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగానే ఉంటుందనిఆయన అన్నారు.
వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ… pic.twitter.com/xlccVloT0P — Harish Rao Thanneeru (@BRSHarish) September 4, 2024
ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రజల్లోనే ఉన్నారని.. అధికారంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజాపక్షమే అని బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రకృతి సృష్టించిన విపత్తు.. పాలకులు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి ప్రజలను ఆందోళన పరుస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రజలను, బాధితులను ఆదుకునేందుకు అందరూ పెద్ద మనసులో ముందుకు రావాలని కేసీఆర్ కోరారు.