హనుమకొండ రాంనగర్‌లోని ఒక అపార్ట్ మెంట్‌లో సీఐడి విభాగంలో పని చేసే కానిస్టేబుల్ నివాసం ఉంటున్నాడు.. అదే అపార్ట్ మెంట్‌లో పార్కింగ్‌లో చిన్నారులు ఆడుకుంటుూ ఉంటారట.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అసలే కాంక్రీట్ వరల్డ్ అయిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి అపార్ట్ మెంట్ సెల్లార్లే మిగిలాయి. పార్కులు...ఇంటిముందు ప్లేసులు ఎప్పుడో పోయాయి. అసలు ఒకప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఎంత ప్లేసు ఉండేది. ఇప్పుడు సెల్లార్లు కూడా మిగిలేలా లేవు. ఈ విషయం చూశాక...ఎక్కడ నుంచి వస్తార్రా మీరంతా అనాలనిపిస్తుంది. ఏంటి విషయం అంటారా ..
హనుమకొండ రాంనగర్‌లోని ఒక అపార్ట్ మెంట్‌లో సీఐడి విభాగంలో పని చేసే కానిస్టేబుల్ నివాసం ఉంటున్నాడు.. అదే అపార్ట్ మెంట్‌లో పార్కింగ్‌లో చిన్నారులు ఆడుకుంటుూ ఉంటారట. ఎప్పుడు ..ఎక్కడా జరిగేదే కదా..అయితే సార్ సడన్ గా కారు మీద గీతలు గమనించారు. దీంతో అక్కడ ఆడుకున్న పిల్లలే కారు గీతలు పెట్టి ఉంటారని సారు భావించి పోలీసు కేసు పెట్టారు.
దీంతో ఆధారంగా సీసీటీవీ ఫుటేజీలో పిల్లలంతా కలిసి ఆడుకుంటున్న వీడియోను చూపించి కేసు పెట్టారట. అయితే పిల్లల పేరెంట్స్ కు కాల్ వచ్చే వరకు ఈ విషయం వారికి తెలీదట. తెలిసిన తర్వాత పేరెంట్స్ అంతా కలిసి ఆ కారు మీద గీతలకు అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపినా ఆయన వినలేదట. చిన్నపిల్లలపై కేసు నమోదు చేయడమేంటని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. ఇదేం కేసు అని పోలీసులు కూడా తలబాదుకుంటున్నారంటే నమ్మండి.