ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో హ్యాండ్ రైడ్ ఫోన్ ఉంటుంది.తప్పనిసరిగా రోజులో ఒక్కసారైనా google ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇలా గూగుల్ ఓపెన్ చేసిన సమయంలో మనకు ఒక్కోసారి గూగుల్
న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో హ్యాండ్ రైడ్ ఫోన్ ఉంటుంది.తప్పనిసరిగా రోజులో ఒక్కసారైనా google ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇలా గూగుల్ ఓపెన్ చేసిన సమయంలో మనకు ఒక్కోసారి గూగుల్ నుంచి వాయిస్ వినిపిస్తుంది. మరి ఆ గూగుల్ లో వచ్చే వాయిస్ ఎవరిది అనేది చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే ఈ గూగుల్ కు వాయిస్ ఇచ్చిన అమ్మాయి మన తెలుగు రాష్ట్రానికి చెందిన అమ్మాయే అని తెలుస్తోంది. ఆమె ఎవరు ఆ వివరాలు చూద్దాం.
సాధారణంగా మనం ఏదైనా పదానికి అర్థం కావాలంటే గూగుల్ ద్వారా సమాధానాన్ని వెతుకుతాం. ఒక్కోసారి వాయిస్ టైప్ చేస్తే గూగుల్ కూడా మనకు వాయిస్ లో సమాధానం ఇస్తుంది. మరి ఇందులో సమాధానం ఇచ్చే గొంతు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి గ్రీష్మ రెడ్డిదట. కర్నూలు జిల్లాకు చెందిన గ్రీష్మ రెడ్డి బిటెక్ పూర్తి చేసి సివిల్స్ ప్రిపేర్ అవ్వడం కోసం ఢిల్లీకి వెళ్లిందట. అయితే ఈమె తల్లి డిప్యూటీ కలెక్టర్ తండ్రి కలెక్టర్ గా రిటైర్ అయ్యారు. చెన్నైలోని ఓ కాలేజీలో గ్రీష్మారెడ్డి బయోటెక్నాలజీ బిటెక్ పూర్తి చేసి ఢిల్లీ వెళ్లి ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేసింది.
అక్కడే ఒక స్నేహితురాలి ద్వారా వాయిస్ ఓవర్ రంగంలోకి అడుగు పెట్టింది. చిన్నతనం నుంచి మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టపడే గ్రీష్మ, డబ్బింగ్ చెప్పడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇలా ఆ విధంగా తన కెరియర్ ను ఆ వైపు మళ్ళించింది. అలా ఒక సమయంలో గూగుల్ నుంచి ఆమెకు ఉద్యోగ ఆఫర్ రావడంతో గూగుల్ ట్రాన్స్లేటర్ తో గొంతు కలిపే ఛాన్స్ దక్కింది. గూగుల్లో ఎన్నో వేల తెలుగు పదాలు పలకడంతో పాటు, వందల కథనాల పదాలకు అనుగుణంగా ఉచ్చారణ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇతర భాషల్లో కూడా ప్రభుత్వ ప్రకటనల కోసం ఆమె వాయిస్ ఇస్తూ ఉంటుందట. ఈ విధంగా గ్రీష్మ చాలా డిఫరెంట్ గా ఆలోచించి తన కెరియర్ ను సెట్ చేసుకుంది.