Diwali 2024: భారత్ లోనే కాదు ..దీపావళి ఈ దేశాల్లో కూడా చాలా బాగా చేస్తారని తెలుసా ?

దీపావళి చాలా స్పెషల్ . నార్త్ లో దీపావళి మన సంక్రాంతిలాగా ..బోనాల్లాగా చేసుకుంటారు. కాని ప్రతి హిందువు పండుగ జరుపుకుంటారు


Published Oct 28, 2024 04:07:00 PM
postImages/2024-10-28/1730111992_1659608853.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దీపావళి చాలా స్పెషల్ . నార్త్ లో దీపావళి మన సంక్రాంతిలాగా ..బోనాల్లాగా చేసుకుంటారు. కాని ప్రతి హిందువు పండుగ జరుపుకుంటారు. కాని దీపావళిని భారత్ మాత్రమే కాదు...మరికొన్ని దేశాల్లో ప్రజలు జరుపుకుంటారు. ఎక్కడెక్కడో చూసేద్దాం.


ఎక్కడికి వెళ్లినా ఇప్పుడు భారతీయులు చాలా కామన్ గా కనిపిస్తున్నారు. ఏ దేశంలో అయినా భారతీయులు పక్కాగా కనిపిస్తున్నారు.. కాబట్టి భారతీయులు ఎక్కువగా కనిపించే అన్ని ప్రదేశాల్లోను దీపావళి జరుపుకుంటారు. 


నేపాల్: దీపావళి పండుగను నేపాల్‌లో తీహార్‌గా జరుపుకుంటారు. ఈ పండుగలో ఐదు రోజుల పాటు కుటుంబ సభ్యులంతా కలిసి పూలతో, దీపాలతో, కొవ్వొత్తులతో ఇళ్లను అలంకరిస్తారు. రేపటి నుంచి దీపావళి పూజలు మొదలవుతాయి. 


మలేషియా: దీపావళి పండుగను భారతదేశంలో పాటు మలేషియాలో కూడా జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను “హరి దీపావళి”గా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున దేశ ప్రజలకు సెలవు దినం.


శ్రీలంక: భారతదేశ పొరుగు దేశం శ్రీలంకలో కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటుంది. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి ప్రతీకగాకాదు… చెడు పై మంచి గెలిచిన రోజు. కాబట్టి శ్రీలంక వారు కూడా పూజలు చేస్తారు.


అమెరికా: అమెరికాలో ఎక్కువ మంది భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. వీరు ప్రతి సంవత్సరం దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. అమెరికాలోని వైట్ హౌస్ దగ్గర దీపావళికి సంబంధించిన ఈవెంట్‌లు కూడా నిర్వహిస్తారు.
సింగపూర్: సింగపూర్‌లో కూడా భారతీయ సంతతికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కూడా దీపావళి వేడుకలు జోరుగా సాగుతాయి. భారతీయ సంతతి వారు ఎక్కడున్నా...ఎన్ని తరాలు దాటినా సింగపూర్ లో మాత్రం దీపావళి పండుగ చేసుకుంటున్నారు.


మారిషస్ : భారతదేశం వలె మారిషస్‌లో దీపావళిని చాలా వైభవంగా జరుపుకుంటారు. మారిషస్ సంస్కృతిలో భారతదేశం ప్రభావం అపారమైనది. చాలా దేశాల్లో దీపావళి చేసినా ..భారత సంతతి వారికే కాదు చాలా దేశాల్లో భారత సంతతికి చెందిన వారే కాకుండా చాలా దేశాలవారు జరుపుకుంటారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu diwali diwali-arrangements

Related Articles