మన భారతదేశంలో చాలామంది ప్రజలు ఎక్కువగా భక్తిని, మూఢ నమ్మకాలను నమ్ముతారు. వీటిపైన ఆధారపడి బ్రతికే వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మన పూర్వకాలం నుంచి వస్తున్న దాని ప్రకారం తల్లిదండ్రులు తప్పు చేస్తే అది పిల్లలపై ప్రభావం చూపుతుందని అంటూ ఉంటారు. మరి అలా తల్లిదండ్రుల తప్పులు, పిల్లలపై ప్రభావం చూపుతాయా.? దీనిపై పండితులు ఏమంటున్నారు అనే వివరాలు చూద్దాం..
న్యూస్ లైన్ డెస్క్: మన భారతదేశంలో చాలామంది ప్రజలు ఎక్కువగా భక్తిని, మూఢ నమ్మకాలను నమ్ముతారు. వీటిపైన ఆధారపడి బ్రతికే వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మన పూర్వకాలం నుంచి వస్తున్న దాని ప్రకారం తల్లిదండ్రులు తప్పు చేస్తే అది పిల్లలపై ప్రభావం చూపుతుందని అంటూ ఉంటారు. మరి అలా తల్లిదండ్రుల తప్పులు, పిల్లలపై ప్రభావం చూపుతాయా.? దీనిపై పండితులు ఏమంటున్నారు అనే వివరాలు చూద్దాం..
సాధారణంగా చాలామంది వారి తాతలు, తండ్రుల నుంచి ఆస్తులను పొందుతారు. ఆ ఆస్తుల ద్వారానే వారు వృద్ధి చెందుతారు. మరి వారి ఆస్తులను అనుభవించినప్పుడు వారి పాప పుణ్యాలు కూడా ఆస్తులతో పాటు సంక్రమిస్తాయట. ముఖ్యంగా మన పెద్దలు మంచి పనులు, పుణ్యాలు చేసి ఉంటే మన తరం, వచ్చేతరం వంశాలకు అన్ని రకాలుగా సంతోషాలని అందిస్తుందట. అలాగే మన పూర్వీకులు పాపాలు గనుక చేసి ఆస్తులను సంపాదించి ఉంటే, ఆ ఆస్తులు మనం అనుభవిస్తే మాత్రం మన పిల్లలకు లేదంటే తర్వాతి తరం వారికి ఆ పాపాలు సంక్రమించి అనేక ఇబ్బందులు పాలవుతారట.
అంతేకాకుండా కొంతమంది వారి యొక్క పూర్వీకుల కర్మలను సరిగ్గా నిర్వహించకపోతే పితృ దోషాలు తగిలి, అది తర్వాత తరాల వంశాలకు పాపంలా వెంటాడుతూ వస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యులంతా ఇబ్బందుల పాలవుతారు. ముఖ్యంగా తాతలు లేదా తండ్రులు ఎవరైనా మహిళలకు అన్యాయం చేస్తే మాత్రం ఆ పాపం తర్వాతి తరం కొడుకులకు లేదా మన వాళ్లకు సంక్రమిస్తుందట. ముఖ్యంగా మనకు కలలో త్రాచుపాము పడగవిప్పి ఉండడం లేదా ముక్కలు ముక్కలై కనిపించడం వంటివి జరిగితే మాత్రం మనకు పితృశాపం వెంటాడుతోందని అర్థం చేసుకోవాలి. అలాగే మహాసముద్రం కానీ పెద్ద సరస్సు కానీ మీ కలలో కనిపించినట్లయితే అది కూడా పితృ శాపం కిందికే వస్తుందట.
అలాగే చనిపోయిన స్త్రీ మీ కలలో కనిపించినట్లయితే అతనికి పితృ శాపం ఉన్నట్టే. స్త్రీ పురుషులు ఎవరైనా సరే వయసులో ఉన్నప్పుడు చెడు అలవాట్లకు బానిసైతే మాత్రం ఆ పాపం తర్వాతి తరంపై వ్యాధుల రూపంలో పట్టిపీడిస్తుంది. పుట్టుకతోనే రోగాలు సోకడం అవయవలోపం వంటివి జరుగుతాయి. ఒకవేళ ఆరోగ్యకరంగా పుట్టిన కాలక్రమేనా వ్యాధుల బారిన పడటం జరుగుతుంది. అందుకే మనం దర్మంగా ఉండి, చెడు అలవాట్లకు లోను కాకుండా ఎవరికి అన్యాయం చేయకుంటే మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండి మన తర్వాతి తరం కూడా ఆరోగ్యవంతులై ఆనందంగా జీవిస్తారని శాస్త్ర పండితులు అంటున్నారు.