హుజురాబాద్ ఏరియా సివిల్ ఆస్పత్రిలో గత వారం రోజుల నుండి వాతావరణంలో మార్పుల ద్వారా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ విష జ్వరాలు వస్తున్నాయని రక్త పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వస్తే రక్త పరీక్షలు చేసే సిబ్బంది లేరని రోగులను తిప్పి పంపించారు.
న్యూస్ లైన్ డెస్క్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ ఏరియా సివిల్ ఆస్పత్రిలో వైద్యానికి నోచుకోని పేద ప్రజలు.వివరాల్లోకి వెళితే పేదలకు వారి వైద్యానికి అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు అధ్వానంగా తయారయ్యాయి. వైద్యానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తే సరైన సదుపాయాలు, సరిపడా వైద్యులు లేకపోవడం గమనార్హం. హుజురాబాద్ ఏరియా సివిల్ ఆస్పత్రిలో గత వారం రోజుల నుండి వాతావరణంలో మార్పుల ద్వారా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ విష జ్వరాలు వస్తున్నాయని రక్త పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వస్తే రక్త పరీక్షలు చేసే సిబ్బంది లేరని రోగులను తిప్పి పంపించారు.
గత వారం రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇదేమిటి అని డాక్టర్లని నిలదీసి అడిగినా కూడా వారు పట్టించుకోకపోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఇదే సమయంలో హుజురాబాద్ ఏరియా సూపర్డెంట్ సమయం దాటినా హాస్పిటల్‌కి లేదని తెలిపారు. రెండు రోజుల క్రితం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నలుగురు వైద్యులు నియామకం అయ్యారు. కానీ, ఒక్కరు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.
రోగులు డబ్బులు లేవని ఈ ఆసుపత్రికి వస్తే జేబులు ఖాళీ చేస్తున్నారని సరియైన వైద్యం అందించడం లేదని మెనూ ప్రకారం భోజనం, పాలు, గుడ్డు, అరటిపండు, రోజువారీగా సమయపాలనగా ప్రకారం ఇవ్వకుండా రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాలాంటి పేదవారికి ఇలా ప్రభుత్వం నుండి మాకు వచ్చే చిన్న చిన్న వాటిని కూడా మాకు అందించకపోవడం చాలా బాధాకరమని రోగులు అంటున్నారు. కరీంనగర్ జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి తనిఖీ చేసి సమస్యలను పరిష్కరించాలని హుజురాబాద్ ఏరియా ప్రజలు అధికారులను కోరుతున్నారు.