House Collapsed: భారీ వర్షాలకు కూలిపోయిన 7 వేల ఇండ్లు

ఈ వరదల 7 వేల ఇండ్లు కూలిపోయాయని ప్రభుత్వానికి అన్ని జిల్లా కలెక్టర్లు నివేదిక పంపించారు


Published Sep 06, 2024 09:28:53 AM
postImages/2024-09-06/1725595133_indiramma.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ వర్షాల వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వరదల కారణంగా ఇప్పటికీ అనేక గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఉన్నారు. ఈ వరదల 7 వేల ఇండ్లు కూలిపోయాయని ప్రభుత్వానికి అన్ని జిల్లా కలెక్టర్లు నివేదిక పంపించారు. ఇండ్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇందిరమ్మ ఇండ్ల కింద ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షలు, స్థలం లేని వారికి స్థలం, రూ.5 లక్షల ఇస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు. అయితే ప్రభుత్వం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల కూలిపోయాయని ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చూస్తోంది. 

newsline-whatsapp-channel
Tags : telangana collectors cm-revanth-reddy congress-government heavy-rains house

Related Articles