Bonalu:ఆషాడ మాసం బోనం చేస్తే  కోటీశ్వరులు అవుతారు.!

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ మొదలవుతుంది. ఈ పండగలో ప్రజలంతా భాగస్వాములై సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి బోనాల పండుగ ముందుగా హైదరాబాదులో మొదలై రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తుంది. మొత్తం నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ  గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం..


Published Jul 06, 2024 06:03:00 PM
postImages/2024-07-06/1720267533_bonalu.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఆషాడ మాసం వచ్చిందంటే చాలు  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ మొదలవుతుంది. ఈ పండగలో ప్రజలంతా భాగస్వాములై సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి బోనాల పండుగ ముందుగా హైదరాబాదులో మొదలై రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తుంది. మొత్తం నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ  గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం..

గోల్కొండ కోటపై వెలిసినటువంటి జగదాంబ అమ్మవారికి మొదటి భోనం సమర్పించడంతోనే ఈ పండుగ మొదలవుతుంది. ఎప్పుడైనా ఆషాడ మాసం మొదటి గురువారం లేదంటే ఆదివారం పండగ ప్రారంభం అవుతుంది. ఇలా మొదటి బోనాన్ని గోల్కొండ జగదాంబికా అమ్మవారికి సమర్పించి  సంబరాలు స్టార్ట్ చేసి  ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అలా వారం రోజుల్లో సికింద్రాబాద్ అంతటా బోనాలు జరుపుకుంటారు. దీని తర్వాత లాల్ దర్వాజా, బల్కంపేట, పాతబస్తీ, దూల్ పేట,  కొత్తబస్తీ, ఆలయాల్లో సమర్పిస్తారు. తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీకగా  నిలిచే బోనాల సంప్రదాయం  ఇప్పటిది కాదు.

దీని వెనుక ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. ముఖ్యంగా బోనం అంటే భోజనం..  ఈ భోజనాన్ని అమ్మవారి సమర్పించడం వల్ల కడుపారా ఆరగించి, ఆనందపడి మనకు కోరికలు తీరుస్తుంది.  ఈ పండగ అనేది ముఖ్యంగా పల్లెటూర్ల నుంచి మొదలైంది. ఏ పండగ వెనక పల్లె వాసన గుబాలిస్తుంది.  సాధారణంగా రుతువులు మారిన కొలది వాతావరణం కూడా మారుతూ ఉంటుంది. వర్షాకాలంలో అంటువ్యాధులు వస్తూ ఉంటాయి.  టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటివి ఈ సీజన్లోనే సోకుతాయి. ఈ వ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడు అమ్మ అంటూ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు మొక్కుతారు.  

అంతేకాకుండా ఈ సీజన్ లో వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని ప్రకృతి ఆరాధ్య దైవమైన అమ్మకు బోనం చేసి మహిళలు ఈ బోనాన్ని సమర్పిస్తారు. అంతే కాకుండా తల్లికి పసుపు, కుంకుమలు సీరే, సారే  వంటివి సమర్పిస్తారు. ముఖ్యంగా పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఇలా అమ్మవార్ల పేర్లు వేరైనా  బోనాలు మాత్రం చేసేది మహిళా దేవతకే. ఇలా మట్టి కుండలో బోనం వండి పసుపు కుంకుమతో అలంకరించి దీపం పెట్టి, వేపరెమ్మలు పట్టుకొని డప్పు చప్పుల మధ్య అమ్మవారికి బోనం సమర్పించి వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని మొక్కుతారు. అలా అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల మనకు ఆరోగ్యం బాగుండడమే కాకుండా, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రజల యొక్క నమ్మకం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bonalu golkonda ashadamasam jagadamba-ammavaru

Related Articles