మన భారత దేశంలో దేవుళ్ళని ఎక్కువగా నమ్ముతారు. ముఖ్యంగా దేవుడికి పూజ చేసే సమయంలో పువ్వులను వాడుతూ ఉంటారు. అలా ఒక్కో దేవుడికి ఒక్కోరకమైన పువ్వులు ఇష్టం ఉంటాయి. ఆ పూలతో ఆ దేవుళ్లని పూజించి ఆశీర్వాదాలు పొందుతారు భక్తులు. వాస్తు ప్రకారం పువ్వులు మన అదృష్టంతో ముడిపడి ఉంటాయి. సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. పూలతో పూజ చేయడం వల్ల ఆర్థిక, వైహాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు.
న్యూస్ లైన్ డెస్క్: మన భారత దేశంలో దేవుళ్ళని ఎక్కువగా నమ్ముతారు. ముఖ్యంగా దేవుడికి పూజ చేసే సమయంలో పువ్వులను వాడుతూ ఉంటారు. అలా ఒక్కో దేవుడికి ఒక్కోరకమైన పువ్వులు ఇష్టం ఉంటాయి. ఆ పూలతో ఆ దేవుళ్లని పూజించి ఆశీర్వాదాలు పొందుతారు భక్తులు. వాస్తు ప్రకారం పువ్వులు మన అదృష్టంతో ముడిపడి ఉంటాయి. సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. పూలతో పూజ చేయడం వల్ల ఆర్థిక, వైహాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు.
కాబట్టి మనం ఆర్థికంగా ఎదగాలి అంటే లక్ష్మీదేవిని ఈ పువ్వులతో తప్పనిసరిగా పూజించాలట. ఆ పువ్వులు ఏంటో తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్ర మైనటువంటి పువ్వులు మందార పువ్వులు. ఈ పూలతో పరిహారాలు చేస్తే అన్ని ఆటంకాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. ముఖ్యంగా ఎరుపు రంగు మందార పూలతో పూజ చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మనపై ఉండి, జీవితంలో డబ్బు కొరత ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా అప్పుల బాధతో ఇబ్బందులు పడేవారు సులభమైన పరిష్కారాలు పొందాలి అంటే తప్పనిసరిగా మందార పూలతో దుర్గామాతను, వినాయకుడిని పూజించాలని వారం రోజులపాటు రోజుకు ఐదు పూలతో ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగిపోయి, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని అంటున్నారు. అలాగే ఈ పూలతో సూర్యదేవున్ని పూజిస్తే మీ కుటుంబంలో ఉండేటువంటి అలజడులు అన్నీ తొలగిపోయి మీరు హ్యాపీగా జీవిస్తారని అంటున్నారు. ఇక మరి ముఖ్యంగా ఈ మందార చెట్టు ఇంట్లో నాటినట్లయితే పాజిటివ్ ఎనర్జీ పెరిగి శాంతి నెలకొంటుందట.