KTR : రేవంత్ కి చేతగాదు.. అందుకే వారం రోజులు దాచారు

సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోవడానికి పూర్తి బాధ్యత పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిదే అని కేటీఆర్ మండిపడ్డారు. సర్కారు తప్పు లేకపోతే వారం రోజుల పాటు సుంకిశాల విషయాన్ని ఎందుకు దాచిందని ఆయన ప్రశ్నించారు.


Published Aug 09, 2024 12:14:26 PM
postImages/2024-08-09/1723185866_ktrattelanganabhavan.jpg

న్యూస్ లైన్ డెస్క్ : సుంకిశాల ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే అని.. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోవడానికి పూర్తి బాధ్యత పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిదే అని కేటీఆర్ మండిపడ్డారు. సర్కారు తప్పు లేకపోతే వారం రోజుల పాటు సుంకిశాల విషయాన్ని ఎందుకు దాచిందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆగష్టు 2న సుంకిశాల ప్రమాదం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆగస్ట్ 2 న ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సమావేశాల్లో స్టేట్ మెంట్ చేయాలి. ఈ ప్రమాదం జరిగినప్పుడు అసెంబ్లీ జరుగుతోంది. కానీ అసెంబ్లీలో చెప్పలేదు. ఈ ప్రభుత్వానికి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియాదా? తెలిసి పట్టించుకోలేదా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

నిజంగా ప్రభుత్వానికి ఈ విషయం తెలియదంటే మాత్రం సిగ్గుచేటు. ఈ ప్రమాదం గురించి పక్కా మీకు తెలుసు. వారం రోజులు గోప్యంగా ఉంచారు. మీరు ఆగమాగం పనులు ప్రారంభిచంటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులే చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమాదం జరిగింది. లేకుంటే చాలా ప్రాణనష్టం జరిగేది. మంచి జరిగితే మాది. చెడు జరిగితే బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ హితవు పలికారు. బాధ్యతల నుంచి తప్పించుకొని గత ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటని ఆయన కామెంట్ కామెంట్ చేశారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసిన అడ్డగోలు వాదనలు అబద్ధాలని తేలిపోయింది. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం రిజర్వాయర్లను పంపింగ్ చేసి నీటిని ఎలా నింపుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్ల విషయంలో కెసిఆర్ విజయాలను అంగీకరించలేని కురచమ నస్తత్వంతోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో జరిగితే ఎన్డీఎస్ఏ వస్తది. ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇస్తారు. మరి ఇక్కడకు ఎందుకు కేంద్ర సంస్థ వస్తలేదు. ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి అనుకోవాలా? అని కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయండి. సంఘటన స్థలంలోనే మంత్రి భట్టి విక్రమార్క ఈ ప్రకటన చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news revanth-reddy ktr cm-revanth-reddy latest-news telugu-news

Related Articles