KTR: బహుజన ఆత్మగౌరవానికి సర్వాయి ప్రతీక

కృషిని, పట్టుదలను, ఆయన పోషించిన చారిత్రక పాత్రను ప్రతిఒక్కరు స్మరించుకోవాలని సూచించారు. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.


Published Aug 18, 2024 11:37:03 AM
postImages/2024-08-18/1723961223_papanna.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పించారు. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని కేటీఆర్ ట్వీట్ చేశారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో 
సువర్ణాక్షరాలతో  ఎప్పటికీ నిలిచి ఉంటుందని తెలిపారు.

కృషిని, పట్టుదలను, ఆయన పోషించిన చారిత్రక పాత్రను ప్రతిఒక్కరు స్మరించుకోవాలని సూచించారు. కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వ హించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.

తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంతోపాటు, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేశామని కేటీఆర్ తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam sarvayipapannagoud sardarsarvayipapanna

Related Articles