ఇటీవల స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఓ నివేదిక వెల్లడించింది. గ్లోబల్ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ పై వీరు అధ్యయనం చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బధ్దకం వెధవ...అసలు ఎంత సోమరిపోతువి ..పనిదొంగ లాంటి తిట్లు మనం రోజు పేరెంట్స్ దగ్గర వింటూనే ఉంటాం అయితే ఈ తిట్లు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో లేజీ దేశాలను తిడుతున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అందులో మన దేశంలో బధ్ధకస్థుల చిట్టా విప్పుతుంది. భారతదేశంలో చాలా సోమరిపోతుల అడ్డా అని అంటున్నాయి. నివేదికలు.. ఇది నిజం, ఇటీవల స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఓ నివేదిక వెల్లడించింది. గ్లోబల్ ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ పై వీరు అధ్యయనం చేశారు.
అన్ని దేశాలు ..తిండికి తగ్గ పనిచేస్తున్నాయి కాని భారత్ మాత్రం తిని , కూర్చోవడమే పనిగా తిరుగుతున్నారు. ముసలి , ముతక వేరు....ఈ యూత్ కూడా అలానే తయారవుతుంది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తన పరిశోధన కోసం 46 దేశాలకు చెందిన 7 లక్షల మందికి పైగా డేటాను విశ్లేషించింది. వారు రోజువారీ నడక నుండి స్మార్ట్‌ఫోన్ డేటా ఉపయోగించబడింది. బధ్దకస్థుల లిస్ట్ లో ఫస్ట్ ఇండోనేషియా ప్రజలు మొత్తం ప్రపంచంలోనే సోమరిపోతులు అని తేలింది. అసలు వారికి ఫిజికల్ యాక్టివిటీనే లేదు.
సౌదీలోని ప్రజలు ప్రతిరోజూ సగటున కేవలం 3,807 అడుగులు మాత్రమే నడుస్తారు. సౌదీలో వేడి ఎక్కువగా ఉంటుంది. వేడి కారణంగా సౌదీలోని ప్రజలు తమ ఇళ్లలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కాని వారు దీని తగిన వ్యాయామాలు చేస్తారట. బధ్దకస్తుల బ్యాచ్ లో భారత్‌కు 10వ ర్యాంకు లభించింది. భారతదేశంలోని ప్రజలు రోజుకు సగటున 4,297 అడుగులు మాత్రమే నడుస్తారు. భారతదేశం వేగవంతమైన పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి ఈ సోమరితనానికి ప్రధాన కారణాలు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో శారీరక శ్రమలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. వీరికి ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉందని తెలిపింది.