GHMC పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి ప్రాంతాల్లో భూములు కొనాలనే ఆలోచన కూడా ప్రజలు మానేసినట్లు అనిపిస్తోంది. చెరువులు, వాటి పరిసరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో హైడ్రాతో జనంలో భయాందోళనలు నెలకొన్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్, నగర పరిసర ప్రాంతాల్లో భూములను కొనాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. గతంలో భూములు కొనాలంటే ధర ఎక్కువైనా సరే హైదరాబాద్‌లో కొనేందుకే మొగ్గు చూపేవారు. కానీ, చెరువులు, జలాశయాల సంరక్షణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా కారణంగా భూముల కొనుగుళ్లు, భవనాల కట్టడాలు అంటే భయపడుతున్నారు. GHMC పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి ప్రాంతాల్లో భూములు కొనాలనే ఆలోచన కూడా ప్రజలు మానేసినట్లు అనిపిస్తోంది. చెరువులు, వాటి పరిసరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో హైడ్రాతో జనంలో భయాందోళనలు నెలకొన్నాయి.
గతంతో పోలిస్తే భూముల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. జులై నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.320 కోట్ల మేర తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, హైడ్రా కూల్చివేతల కారణంగానే ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతోంది. GHMC పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డిలో జులై నెలలో 58,000 రిజిస్ట్రేషన్లు కాగా.. ఆగస్టులో 41,200 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయని వెల్లడించింది. జూలై నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1105 కోట్లు కాగా.. ఆగస్టులో రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గి రూ.785 కోట్లకి పడిపోయిందని రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించింది.