Mr bachchan: మిస్టర్ బచ్చన్ ఓటిటి స్ట్రీమింగ్..ఎందులో అంటే.?

మాస్ మహారాజా రవితేజ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు.  కామెడీ చిత్రాలు కానీ, యాక్షన్ చిత్రాలు కానీ, ఎమోషనల్ చిత్రాలు కానీ, ఇలా ఏ పాత్రలో అయినా దూరిపోయే శక్తి కలిగిన


Published Aug 15, 2024 05:20:00 PM
postImages/2024-08-15/1723721394_mrbachchan.jpg

న్యూస్ లైన్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు.  కామెడీ చిత్రాలు కానీ, యాక్షన్ చిత్రాలు కానీ, ఎమోషనల్ చిత్రాలు కానీ, ఇలా ఏ పాత్రలో అయినా దూరిపోయే శక్తి కలిగిన వ్యక్తి. అలాంటి రవితేజ తాజాగా నటించి రిలీజ్ అయిన చిత్రం  మిస్టర్ బచ్చన్.  ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేశారు.  భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది.

హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి న్యూస్ బయటకు వచ్చింది. సినిమా రిలీజ్ అయి, ఒక రోజు కూడా గడవకముందే ఓటీటీ రిలీజ్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఓటీటీలో  రిలీజ్ అవుతుందట. మిస్టర్ బచ్చన్ ఓటీటి హక్కులను ఓటిటి సంస్థ నెట్ఫ్లిక్స్    సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు అన్నది తెలియాల్సి ఉంది.  ఈ మధ్యకాలంలో థియేటర్లలోకి వచ్చిన చిత్రాలు అంతంతమాత్రంగా ఆడినా కనీసం రెండు నుంచి మూడు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి.  కానీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఓటిటీ న్యూస్ వినపడుతోంది. అయితే ఈ సినిమా పూర్తిస్థాయిలో హిట్ అవుతుందా లేదంటే ఫ్లాప్ అవుతుందా అని అనుమానం ఉంది కాబట్టే ఓటీటీ గురించి వార్తలు రాస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా స్ట్రీమింగ్  అవ్వడానికి  సిద్ధమైపోయిందని చెప్పవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ott-movies raviteja net-flex mr-bachchan bagyasri-boorse

Related Articles