NOEL TATA : టాటా ట్రస్ట్స్​​ ఛైర్మన్​గా నోయెల్ టాటా !

రతన్ టాటా మరణించిన తర్వాత ట్రస్ట్ పగ్గాలు నోయల్ టాటా చేతికి వచ్చినా ..రతన్ టాటా ఉన్నపుడే ఈ బాధ్యతలు అన్ అఫిషియల్ గా నోయల్ టాటా చూసుకునే వారు.


Published Oct 11, 2024 10:07:00 PM
postImages/2024-10-11/1728664773_noeltata02.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాటా గ్రూప్ లో ట్రస్ట్ ఛైర్మన్ గా నోయల్ టాటా నియమితులయ్యారు. అక్టోబర్ 11 ముంబై లో ప్రెస్ మీట్ ద్వారా ఆ విషయాన్ని తెలిపారు. ఆయన నియామకం ఏకగ్రీవంగా జరిగిందని తెలిపారు. రతన్ టాటా మరణించిన తర్వాత ట్రస్ట్ పగ్గాలు నోయల్ టాటా చేతికి వచ్చినా ..రతన్ టాటా ఉన్నపుడే ఈ బాధ్యతలు అన్ అఫిషియల్ గా నోయల్ టాటా చూసుకునే వారు.


రతన్ టాటాకు నోయెల్ టాటా సవతి సోదరుడు అవుతారు. ఆయన 2014 నుంచి ట్రెంట్​ లిమిటెడ్​కు ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు. ఈ రీటైల్ బట్టల వ్యాపారాన్ని చాలా సక్సస్ ఫుల్ గా నడిపిస్తున్నారు నోయెల్. ఆయన వచ్చిన తర్వాత దశాబ్దకాలంలో నోయెల్ హయాంలో ఈ వ్యాపారం దాదాపు 6వేల రెట్లు పెరిగింది కూడా. 


ఇప్పటి వరకు టాటా ట్రస్టులు అన్నింటినీ రతన్​ టాటానే చూసుకునేవారు. కానీ ఆయన తన తరువాత ఎవరు వీటిని నడపాలో చెప్పకుండానే 86 ఏళ్ల వయస్సులో మరణించారు. సూచాయిగా ఎవరి బాధ్యతలు ఏంటో చెప్పినా ...అఫిషియల్ గా ఏం అనౌన్స్ మెంట్ లేదు.  దీనితో రతన్​ టాటా ఎప్పుడూ చెప్పే 'ముందుకు వెళ్తూనే ఉండాలి' విధానాన్ని అనుసరించి, టాటా గ్రూప్​ నోయెల్ టాటాను టాటా ట్రస్టులకు ఛైర్మన్​గా నియమించారు. రతన్ టాటా ఆదర్శాలతో టాటా గ్రూప్ ముందుకు వెళ్తుందని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ratan-tata tata-company

Related Articles